Allu Arjun : పుష్ప 2కి బ్రేక్.. ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ..

తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ టూర్ కి వెళ్ళాడు. అక్కడి చారిత్రాత్మిక ప్రదేశాలు, అడవులు, టూరింగ్ ప్లేసులన్నీ ఫ్యామిలీతో చూస్తూ...............

Allu Arjun : పుష్ప 2కి బ్రేక్.. ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ..

Allu Arjun enjoying in Rajasthan with family and give break to pushpa 2 movie shoot

Updated On : March 2, 2023 / 9:05 AM IST

Allu Arjun :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో భారీ విజయం సాధించి నార్త్ లో బాగా పాపులర్ అయిపోయాడు. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం బన్నీ అభిమానులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే పుష్ప 2 సినిమా షూట్ మొదలుపెట్టారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ అయినట్టు సమాచారం.

తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ టూర్ కి వెళ్ళాడు. అక్కడి చారిత్రాత్మిక ప్రదేశాలు, అడవులు, టూరింగ్ ప్లేసులన్నీ ఫ్యామిలీతో చూస్తూ విహార యాత్రని ఎంజాయ్ చేస్తున్నాడు. బన్నీ భార్య స్నేహ రెడ్డి రాజస్థాన్ లోని పలు టూరింగ్ ప్లేసులతో ఒక వీడియో చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Ram Charan Favourite Movies : రామ్ చరణ్ ఫేవరేట్ సినిమాలు ఇవే అంట.. మీరు చూశారా?

అలాగే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్కును కూడా విజిట్ చేశాడు. అక్కడి జంతువులను తన పిల్లలకు చూపిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో బన్నీ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బన్నీ లేకపోయినా రామోజీ ఫిలింసిటీలో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. బన్నీ లేని సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇక అల్లు అర్జున్ అభిమానులు పుష్ప 2 సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.