Divya Prabha : విమానంలో వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

నటి దివ్య ప్రభకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో తోటి ప్రయాణికుడు ఇబ్బంది పెట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Divya Prabha

Divya Prabha : మళయాళ నటి దివ్య ప్రభకు ఫ్లైట్‌లో చేదు అనుభవం ఎదురైంది. తోటి ప్రయాణికుడు మద్యం మత్తులో ఆమెను వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Maa Oori Cinema : అక్టోబర్ 12న ‘మా ఊరి సిన్మా’

మళయాళ నటి దివ్య ప్రభ అక్టోబర్ 9 న ముంబయి నుంచి కొచ్చి వెళ్లే ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ 681 ఎక్కారు. తాగిన మత్తులో తోటి ప్రయాణికుడు ఆమెను వేధించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె విషయాన్ని ఎయిర్ హోస్టెస్‌కు కంప్లైంట్ చేసారు.  విమాన సిబ్బంది కేవలం టేకాఫ్‌కు ముందు ఆమెను వేరే సీటుకు మార్చారట. కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత దివ్య ప్రభ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

National Cinema Day : మల్టీప్లెక్స్‌లలో రూ.99కే సినిమా.. కానీ ఆంధ్రా, తెలంగాణలో..

కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత దివ్య ప్రభ తను ఎదుర్కున్న ఇబ్బందిని ఎయిర్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేసారు. తరువాత కేరళ పోలీసులకు తన టిక్కెట్‌ను జత చేసి కంప్లైంట్ చేసారు. ప్రయాణికుల భద్రత కల్పించాలని ఆమె పోలీసులను కోరారు. తనకి ఎదురైన అనుభవాన్ని దివ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు. ‘ఈ ఘటనపై పోలీసులు తగిన చర్యలు తీసుకునేలా మీరంతా నాకు సహకరించండి’ అంటూ ఆమె నెటిజన్లను రిక్వెస్ట్ చేసారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.