Actress Gautami : సీనియ‌ర్ న‌టి గౌత‌మి ప్రాణాల‌కు ముప్పు..! పోలీసుల‌కు ఫిర్యాదు.. ఏం జ‌రిగిందంటే..?

త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంద‌ని సినీ న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు గౌత‌మీ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

Actress Gauthami Files Police Complaint Over Threats and Land Dispute

త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంద‌ని సినీ న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు గౌత‌మీ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు చెన్నై పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదానికి సంబంధించి కొంత మంది వ్య‌క్తుల నుంచి త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని అందులో పేర్కొన్నారు. త‌న‌కు భ‌ద్ర‌త‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

చెన్నైలోని నీలంకరైలో ఉన్న రూ.9 కోట్ల విలువైన ఆస‌క్తి సంబంధించి ఈ బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని ఆమె తెలిపింది. ఈ ఆస్తిని అళ‌క‌ప్ప‌న్ అనే వ్య‌క్తి ఆక్ర‌మించుకున్న‌ట్లు ఆరోపిస్తూ గ‌తంలోనే గౌత‌మి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ కోర్టులో ఉంది. కోర్టు ఆదేశాల మేర‌కు ఆ ఆస్తిని సీల్ చేశారు.

Mega 157 : చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ.. ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్‌..

కాగా.. తన భూమి ఆక్రమణలను అడ్డుకోవడానికి కొంతమంది అధికారులు లంచం డిమాండ్ చేశారని, న్యాయ‌వాదుల‌మ‌ని ప‌రిచయం చేసుకున్న కొంత మంది త‌న‌ను బెదిరిస్తున్నార‌ని తాజా ఫిర్యాదులో న‌టి పేర్కొన్నారు. కొంతమంది తనపై నిరసన తెలిపేందుకు ప్రణాళికలు వేస్తున్నారని, అది తనను హాని చేసేందుకు చేస్తున్న కుట్రలో భాగమని ఆమె అనుమానిస్తున్నట్లు అందులో పేర్కొంది.

గతంలో బీజేపీతో కలిసి పనిచేసిన గౌత‌మి ప్రస్తుతం ఏఐఏడీఎంకేలో ఉన్నారు.

Hari Hara Veera Mallu : పవ‌న్‌ ‘హరి హర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్..