Actress Hema: ఆయన బతికి ఉంటే నా లైఫ్ మరోలా ఉండేది.. నటి హేమ ఎమోషనల్
దాసరి నారాయణ రావుపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన నటి హేమ(Actress Hema).
Actress hema emotional comments on dasari narayana rao
- దాసరి సమాధిని శుభ్రం చేసిన మనోజ్.
- గురువుగారిని తలుచుకుని హేమ ఎమోషనల్.
- నెట్టింట వైరల్ అయిన సమాధి వీడియో.
Actress Hema: దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా చేవెళ్లలోని ఆయన సమాధి ముళ్లపొదలతో, పిచ్చిమొక్కలతో దుస్థితిలో ఉన్న దృశ్యాలు అందరినీ షాక్కు గురిచేశాయి. సోషల్ మీడియాలో ఓ యాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసి టాలీవుడ్ హీరో మంచు మనోజ్ వెంటనే స్పందించారు. తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి నేరుగా అక్కడికి చేరుకుని, సమాధి పరిసరాలను స్వయంగా శుభ్రం చేయించి, పూలమాలలు వేసి గురువుగారికి ఘనంగా నివాళులర్పించారు.
Mega 158: చిరు ‘మెగా 158’లో క్రేజీ కాంబినేషన్.. కీలక పాత్రలో నారా రోహిత్
ఈ క్రమంలోనే మే 30న దాసరి వర్ధంతిని పురస్కరించుకుని సీనియర్ నటి హేమ(Actress Hema) కూడా ఆ సమాధి వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. వైరల్ అయిన వీడియో తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు గురువుగారి వర్ధంతి అన్న విషయం తన మనసులో లేకపోయినా, ఆ వీడియో చూశాక తట్టుకోలేక మరో నలుగురిని వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గురువుగారే ఆత్మరూపంలో తమ చేత ఈ పవిత్ర కార్యాన్ని చేయించుకున్నట్లు అనిపిస్తోందని హేమ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనే కనుక ఈ రోజు బతికి ఉంటే తన జీవితం మరోలా ఉండేదన్నారు. ఇప్పటికైనా ఆయన ఆశీస్సులతో తాను మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని, రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ, దాసరి దీవెనలు ఎప్పటికీ తనపై ఉంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
