Mega 158: చిరు ‘మెగా 158’లో క్రేజీ కాంబినేషన్.. కీలక పాత్రలో నారా రోహిత్
మెగాస్టార్ చిరంజీవి మెగా 158(Mega 158) సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్న నారా రోహిత్.
Nara Rohith playing a special role in Chiranjeevi and Bobby Kolli mega 158 movie
- ‘మెగా 158’ షూటింగ్‌కు సిద్ధం.
- కీలక పాత్రలో నారా రోహిత్.
- భారీ బడ్జెట్‌తో కేవీఎన్ నిర్మాణం.
Mega 158: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా 158(Mega 158)’ ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ సరికొత్త సినిమాపై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించుకున్న చిత్ర యూనిట్, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.
ఈ సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే ఒక కీలకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ విలక్షణ నటుడు నారా రోహిత్‌ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. కథ ప్రకారం ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ పాత్ర కోసం పలువురు యంగ్ హీరోలను పరిశీలించిన తర్వాత, చివరకు నారా రోహిత్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విలక్షణమైన కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుండగా, మలయాళ ముద్దుగుమ్మ అనశ్వర రాజన్ చిరంజీవి కూతురిగా కనిపించనుంది.
