Jabardasth : కోపంతో జబర్దస్త్ నటుడిని తిట్టేసిన ఇంద్రజ.. కానీ స్టేజిపై క్షమాపణలు చెప్పి..

కోపంతో జబర్దస్త్ నటుడిని తిట్టేసిన ఇంద్రజ. కానీ ఆ తరువాత స్టేజిపై అందరి ముందు క్షమాపణలు చెప్పి..

Actress Indraja said sorry to Jabardasth Actor Nukaraju

Jabardasth : తెలుగు కామెడీ షో జబర్దస్త్ ఎంతోమంది నటీనటులకు అవకాశం ఇస్తూ.. ఫేమ్ లోకి తీసుకు వస్తుంటుంది. అయితే కేవలం ఆ ప్రతిభావంతులకు అవకాశం ఇచ్చి సరిపెట్టుకోదు, వారి తప్పుఒప్పులను కూడా చెబుతూ మందలిస్తూ వస్తుంటుంది. ఈక్రమంలోనే జబర్దస్త్ లోని కమెడియన్స్ అప్పుడప్పుడు జడ్జిల నుంచి, షో నిర్వాహుకుల నుంచి తిట్లు ఎదుర్కొంటూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జడ్జిగా చేస్తున్న నటి ఇంద్రజ.. కమెడియన్ నూకరాజు ని మందలించారట. అయితే ఇది ఆఫ్ సెట్స్ లో జరిగింది. దానికి నూకరాజు చాలా బాధపడినట్లు తెలుస్తుంది. అందుకనే, ఆ బాధని వ్యక్తం చేసేలా కొత్త ఎపిసోడ్ లో తన స్కిట్ ని ఇంద్రజ మందలింపు గురించి చేశాడు. ఇక ఆ స్కిట్ లో నూకరాజు బాధని చూసిన ఇంద్రజ.. స్టేజి పైకి వచ్చి ఆడియన్స్ సమక్షంగా క్షమాపణలు చెప్పారు.

Also read : Kurchi MadathaPetti : గ్లోబల్ స్థాయికి పోతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఫేమ్.. ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్ కంపెనీ..

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రీసెంట్ గా షో నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఇంద్రజ మాట్లాడుతూ.. “నూకరాజు నాకు కొడుకు సమానుడు. ఏదో చనువుతో రెండు మాటలు అనేశాను. అందుకు ఇప్పుడు అందరూ ముందు క్షమాపణ చెబుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సమయంలో నూకరాజు చాలా ఎమోషనల్ అయ్యినట్లు ఆ ప్రోమోలో చూపిస్తూ వచ్చారు. మరి అసలు ఇంద్రజ ఎందుకు కోపడ్డారో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.