సెట్‌లో కోతితో జయవాణి.. వీడియో వైరల్..

  • Published By: sekhar ,Published On : October 6, 2020 / 06:38 PM IST
సెట్‌లో కోతితో జయవాణి.. వీడియో వైరల్..

Updated On : October 6, 2020 / 6:43 PM IST

Jayavani Latest Video: కరోనా కారణంగా దాదాపు ఏడు నెలలపాటు ఇళ్లకే పరిమితమైన నటీనటులు, లాక్‌డౌన్ సడలింపుతో సినిమా షూటింగులు తిరిగి ప్రారంభమవడంతో ఒక్కొక్కరుగా సెట్లోకి అడుగుపెడుతున్నారు. ఇన్నాళ్లూ యాక్షన్, కట్, పేకప్ వంటి సౌండ్స్ మిస్ అవడం, చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చక్కగా షూటింగులో పాల్గొంటున్న పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తాజాగా పాపులర్ క్యారెక్టర్ యాక్ట్రెస్ జయవాణి షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటా వీడియో?.. వివరాల్లోకి వెళ్తే..
లాక్‌డౌన్ తర్వాత జయవాణి కూడా షూటింగులో పాల్గొంటున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో నటించిన జయవాణి గుమ్మడిని కొత్తగా పరిచయం చేయనవసరం లేదు.

బెల్లంకొండ శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారామె. బ్రేక్ టైంలో జయవాణికి ఓ కోతి కనిపించడంతో దానికి యాపిల్ పెట్టారు. యాపిల్ ముక్కలను కొబ్బరిచిప్ప తిన్నట్లు తింటూ.. మరో ముక్క కావాలంటూ ఆమె మీదకు ఎగబడుతుంది కోతి. ఈ తతంగమంతా కమెడియన్ శ్రీనివాస రెడ్డితో పాటుగా సెట్లో వారు కూడా వీడియో తీశారు. దీంతో జయవాణి కోతి వీడియో కాస్తా వైరల్ అవుతోంది.. అదీ సంగతి..