Sunjay Kapoor : హీరోయిన్ మాజీ భర్త మరణం.. తేనెటీగ మింగితే అది కుట్టి హార్ట్ ఎటాక్ వచ్చిందట..

సంజయ్ కపూర్ మరణించడానికి ఓ అరుదైన సిండ్రోమ్ కారణం అని తెలుస్తుంది.

Sunjay Kapoor : హీరోయిన్ మాజీ భర్త మరణం.. తేనెటీగ మింగితే అది కుట్టి హార్ట్ ఎటాక్ వచ్చిందట..

Actress Karisma Kapoor Ex Husband Sunjay Kapoor Passed Away Due to Bee

Updated On : June 13, 2025 / 3:40 PM IST

Sunjay Kapoor : ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ నిన్న జూన్ 12న ఇంగ్లాండ్‌లో హఠాత్తుగా మరణించారు. పోలో ఆడుతున్నప్పుడు అనుకోకుండా ఒక తేనెటీగను మింగడం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చి మరణించినట్లు సమాచారం. సంజయ్ కపూర్ ఓ పెద్ద వ్యాపారవేత్త. సంజయ్ కపూర్ గొంతులో తేనెటీగ చిక్కుకోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయి గుండెపోటుకు గురవడంత మరణించినట్లు మొదట వైద్యులు తెలిపారు.

అనంతరం సంజయ్ కపూర్ మరణించడానికి ఓ అరుదైన సిండ్రోమ్ కారణం అని తెలుస్తుంది. కౌనిస్ సిండ్రోమ్ వల్లే సంజయ్ మరణించి ఉంటాడు అని వైద్యులు అంటున్నారు. సంజయ్ కపూర్ అనుకోకుండా తేనెటీగను మింగడంతో అది గొంతు లోపలి భాగం కొట్టిందట దీంతో అలెర్జిక్ అక్యూట్ కోరోనరీ సిండ్రోమ్ లేదా కౌనిస్ సిండ్రోమ్ ఏర్పడి గొంతులో అలర్జీ రియాక్షన్ గురయి హార్ట్ అటాక్ వచ్చి మరణించారని వైద్యులు చెప్తున్నారు.

Also Read : Kirrak Seetha : బేబీ, బిగ్ బాస్ ఫేమ్ ‘కిరాక్ సీత’ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?

ఇక వ్యాపారవేత్త అయిన సంజయ్ కపూర్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొదట ఓ ఫ్యాషన్ డిజైనర్ మహ్తానిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో విడిపోయాక 2003 లో హీరోయిన్ కరిష్మా కపూర్ ని పెళ్లి చేసుకున్నారు. వీరు 2016లో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ మీద గృహ హింస కేసు పెట్టడం గమనార్హం. అనంతరం సంజయ్ కపూర్ 2017 లో నటి ప్రియా సచ్‌దేవ్‌ ని వివాహం చేసుకున్నారు.