Actress Kasthuri : తెలుగు నా మెట్టినిల్లు.. ఆ వార్త‌ల‌ను తెలుగు ప్ర‌జ‌లు న‌మ్మొద్దు.. న‌టి క‌స్తూరి

తెలుగు వారిని తాను అవ‌మానించ‌లేద‌ని సినీ న‌టి క‌స్తూరి స్ప‌ష్టం చేశారు.

Actress Kasthuri gives clarity on her comments on Telugu People

Actress Kasthuri : తెలుగు వారిని తాను అవ‌మానించ‌లేద‌ని సినీ న‌టి క‌స్తూరి స్ప‌ష్టం చేశారు. తెలుగు త‌న మెట్టినిల్లు అని, తెలుగు వారంతా త‌న కుటుంబం అని అంది. డీఎంకే పార్టీ కావాల‌నే త‌న‌పై విష‌ప్ర‌చారం చేస్తోంద‌న్నారు. డీఎంకే ద్వంద్వ వైఖ‌రిని ప్ర‌శ్నించ‌డం వ‌ల్లే త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న‌ట్లుగా వెల్ల‌డించింది. ఈ మేర‌కు 10టీవీతో న‌టి క‌స్తూరి మాట్లాడింది.

‘తెలుగు నా మెట్టినిల్లు. తెలుగు వారంతా నా కుటుంబం. ఇది తెలియ‌ని వారు నా వ్యాఖ్య‌ల‌నే త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక తెలుగు ప్ర‌జ‌లు ఎంతో మంది నా పై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. నా కామెంట్స్‌ను వ‌క్రీక‌రిస్తూ త‌మిళ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను తెలుగు ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌ని కోరుతున్నాను.

Actress Kasthuri: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి.. విమర్శలు రావడంతో..

డీఎంకే పార్టీ నా వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తోంది. న‌న్ను బెదిరించే ప్ర‌య‌త్నం చేస్తోంది. తెలుగు వారికి నేను వ్య‌తిరేకంగా మాట్లాడాను అంటూ విష ప్ర‌చారం చేస్తుంది.’ అని క‌స్తూరి అంది.

ఇటీవ‌ల త‌మిళ‌నాడుతో ఓ కార్య‌క్ర‌మంలో క‌స్తూరి మాట్లాడారు. త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డిన తెలుగు వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాట‌లు వైర‌ల్‌గా మారాయి. దీనిపై విమ‌ర్శ‌లు ఎదురుఅయ్యాయి. ఈ క్ర‌మంలో త‌న వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించారు అని కస్తూరి తాజాగా తెలిపింది.

Dulkar Salman : ‘ల‌క్కీ భాస్క‌ర్’ నాలుగు రోజుల క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా.. మెగా బ్లాక్ బాస్ట‌ర్..