Dulkar Salman : ‘ల‌క్కీ భాస్క‌ర్’ నాలుగు రోజుల క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా.. మెగా బ్లాక్ బాస్ట‌ర్..

దుల్కర్‌ సల్మాన్ న‌టించిన మూవీ ‘లక్కీ భాస్కర్‌’.

Dulkar Salman : ‘ల‌క్కీ భాస్క‌ర్’ నాలుగు రోజుల క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా.. మెగా బ్లాక్ బాస్ట‌ర్..

Dulquer Salmaan Lucky Baskhar Movie four Days Collections

Updated On : November 4, 2024 / 2:30 PM IST

దుల్కర్‌ సల్మాన్ న‌టించిన మూవీ ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి క‌థానాయిక‌. ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.

తాజాగా నాలుగో రోజు కలెక్షన్స్‌ వివరాలు తెలియజేసింది చిత్ర బృందం. ఈమేరకు చిత్ర నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సరికొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ.55.4 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసిన‌ట్లుగా తెలియ‌జేసింది. మెగా బ్లాక్ బాస్ట‌ర్ అంటూ రాసుకొచ్చింది.

VD 14 : విజయ్ దేవరకొండ కోసం ‘ది మమ్మీ’ విలన్.. ఈ సారైనా ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..

ఈ మూవీలో దుల్కర్ భార్యగా మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించింది. సాయి కుమార్, సచిన్ ఖేడేకర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్ర‌ క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దుల్కర్ కి తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈ మూవీ మంచి సక్సెస్ అయింది.

Shah Rukh Khan : వామ్మో షారుఖ్ పెట్టుకున్న ఈ వాచీ అన్ని కోట్లా.. ఆ డబ్బుతో ముంబైలో 2BHK ఇల్లు కొనొచ్చు..