Shah Rukh Khan : వామ్మో షారుఖ్ పెట్టుకున్న ఈ వాచీ అన్ని కోట్లా.. ఆ డబ్బుతో ముంబైలో 2BHK ఇల్లు కొనొచ్చు..

Shah Rukh Khan : వామ్మో షారుఖ్ పెట్టుకున్న ఈ వాచీ అన్ని కోట్లా.. ఆ డబ్బుతో ముంబైలో 2BHK ఇల్లు కొనొచ్చు..

Shah Rukh Khan watch is worth crores and could get a 2 BHK in Mumbai

Updated On : November 4, 2024 / 1:02 PM IST

Shah Rukh Khan : సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీస్ కోట్ల విలువ చేసే కార్లు, విల్లాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలా మంది సెలబ్రిటీస్ అత్యధిక ఆస్తి పరుల లిస్ట్ లో ముందు వరుసలో ఉంటారు. ఇక అలాంటి వారిలో షారుక్ ఖాన్ ఒకరు. దేశంలో అత్యంత ధనిక నటుల్లో షారుఖ్ ఖాన్ ఒకరు.

Also Read : ZbigsZach : ఆ పాట నచ్చింది అంటూ తెలుగు పాట పాడిన పోలాండ్ సింగర్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట..

అయితే షారుఖ్ ఆస్తి దాదాపు 7,300 కోట్ల రూపాయలు ఉంటుందట. ఇక ఆయన తిరిగే కార్లు, పెట్టుకునే వాచీల రేట్లు కోట్లల్లో ఉంటాయి. నిజానికి షారుఖ్ కి వాచీలు అంటే తెగ ఇష్టం. ఇక ఇటీవల షారుఖ్ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్ళాడు. అప్పుడు ఓ ఖరీదైన వాచీ పెట్టుకుని మెరిశాడు. ఇకపోతే ఆ వాచీ ధర ఎంతో తేలేదు కానీ ఆ డబ్బుతో ముంబైలో ఓ లగ్జరీ 2 BHK ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా ముంబైలో విలాసవంతమైన విల్లాలు ఎంత ఖరీదైనవో తెలిసిందే. చాలా మంది సినీ సెలెబ్రిటీలు అక్కడ ఉండడానికే ఇష్టపడతారు. అంతే కాదు ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ ముంబై లోనే సొంత నివాసంలో ఉంటున్నారు.