ZbigsZach : ఆ పాట నచ్చింది అంటూ తెలుగు పాట పాడిన పోలాండ్ సింగర్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట..

ZbigsZach : ఆ పాట నచ్చింది అంటూ తెలుగు పాట పాడిన పోలాండ్ సింగర్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట..

Poland singer ZbigsZach who sang a Telugu song

Updated On : November 4, 2024 / 11:59 AM IST

ZbigsZach : చాలా మంది భాషతో సంబంధం లేకుండా ఇతర భాషలను గౌరవిస్తారు. మరికొందరైతే తెలుగు భాష వాళ్ళకి రాకపోయినప్పటికీ తెలుగులో పాటలు మాత్రం పాడేస్తూ ఉంటారు. ఇప్పటికే వేరే దేశాల వాళ్ళు తెలుగులో పాటలు పాడుతూ, తెలుగు డైలాగ్స్ చెప్తూ ఫేమస్ అయ్యారు. ఇక ఇప్పుడు పోలాండ్ కి చెందిన జిబిగ్స్ అనే 15 ఏళ్ల సింగర్ తనకి తెలుగు భాషపై ఉన్న ఇంట్రెస్ట్ తో తెలుగులో పాటలు పాడుతున్నాడు.

Also Read : Shreya Ghoshal : హైదరాబాద్ లో శ్రేయ ఘోషాల్ మ్యూజికల్ నైట్.. ఎక్కడ.. ఎప్పుడంటే..

నిజానికి అతడికి తెలుగు మాట్లాడం రాదు. అయినప్పటికీ పాటలు మాత్రం చక్కగా పాడుతున్నాడు. అయితే ఇప్పటికే ఈ కుర్రాడు తెలుగులో చాలా పాటలు పాడాడు. తాజాగా ఈ కుర్రాడు ‘ధూం ధాం’ సినిమాలోని అందమైన కుందనాల బొమ్మరా అనే పాట పాడి ఓ వీడియో షేర్ చేసాడు. ఈ పాట వినగానే తనకి చాలా నచ్చిందని, మ్యూజిక్ బాగుందని, ముఖ్యంగా నేను పుట్టిన ప్లేస్ లో ఈ సాంగ్ చేశారని అందుకే ఈ పాట పాడుతున్నానని అన్నాడు. అంతేకాదు ఈ సింగర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పేర్కొన్నాడు.

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణంలో సాయి కిషోర్ మ‌చ్చా దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు , టీజర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.