Shreya Ghoshal : హైదరాబాద్ లో శ్రేయ ఘోషాల్ మ్యూజికల్ నైట్.. ఎక్కడ.. ఎప్పుడంటే..

Shreya Ghoshal Musical Night in Hyderabad
Shreya Ghoshal : భారతదేశపు టాప్ సింగర్ శ్రేయ ఘోషాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. శ్రేయ ఘోషాల్ దాదాపు అన్ని భారతీయ భాషల్లో పాడి తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఇటీవల ఆమె జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో చుట్టమల్లే సాంగ్ కూడా పాడింది.
Also Read : Bigg Boss 8 : నయని పావని ఎలిమినేట్.. ఆ ఐదుగురు డమ్మీ ప్లేయర్లు అంటూ షాకింగ్ కామెంట్స్..
అయితే ఈ టాప్ సింగర్ ఇప్పటికే ఎన్నో సినిమా పాటలు పాడడమే కాకుండా చాలా లైవ్ పర్ఫామెన్స్ లు చేసింది. తాజాగా ఇప్పుడు తన మరో లైవ్ పర్ఫామెన్స్ ‘ఆల్ హార్ట్స్ టూర్’ అనే మ్యూజికల్ ఈవెంట్ లో పాల్గొంటున్నారు . ఇక ఈ ఈవెంట్ నవంబర్ 30న ఎల్ బి స్టేడియంలో జరగనుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్ కి సంబందించిన ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో.. టికెట్స్ అయిపోతున్నాయి.. మీ టికెట్స్ కూడా తొందరగా కొనుక్కోండి అని పేర్కొన్నారు.
View this post on Instagram
దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక శ్రేయ ఘోషాల్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే విషయం తెలిసిందే. తను ఎప్పటికప్పుడు తన సాంగ్స్ కి సంబందించిన వీడియోస్ ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.