VD 14 : విజయ్ దేవరకొండ కోసం ‘ది మమ్మీ’ విలన్.. ఈ సారైనా ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..

VD 14 : విజయ్ దేవరకొండ కోసం ‘ది మమ్మీ’ విలన్.. ఈ సారైనా ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..

The Mummy Villain for Vijay Deverakonda in VD14

Updated On : November 4, 2024 / 1:49 PM IST

VD 14 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. సరైన హిట్ లేకపోయినప్పటికీ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేసాడు. అయితే అందులో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో ‘VD 14’ సినిమా కూడా ఒకటి.

Also Read : Shah Rukh Khan : వామ్మో షారుఖ్ పెట్టుకున్న ఈ వాచీ అన్ని కోట్లా.. ఆ డబ్బుతో ముంబైలో 2BHK ఇల్లు కొనొచ్చు..

ఇదిలాఉంటే ఈ సినిమాకి సంబందించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో వస్తున్న ‘VD 14’ సినిమాలో దక్షిణాఫ్రికా నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఆర్నాల్డ్ ‘ది మమ్మీ’ , ‘ది మమ్మీ రిటర్న్స్’ లాంటి చిత్రాల్లో ఈయన విలన్ పాత్రలు పోషించారు.

ఇక ఈయన ‘VD 14’ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే ఇదివరకే లైగర్ తో ఇలాంటి ప్రయత్నం చేసిన విజయ్ ఫ్లాప్ అయ్యాడు. ఇందులో కూడా ఓ హాలీవుడ్ యాక్టర్ ను దింపారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ ప్రయత్నం ఏమౌతుందో చూడాలి.