Actress Kasthuri: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి.. విమర్శలు రావడంతో..

ప్రముఖ నటి కస్తూరి తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై నోరుపారేసుకున్నారు. రాజుల కాలంలో అంత:పుర మహిళలకు ..

Actress Kasthuri: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి.. విమర్శలు రావడంతో..

Actress Kasthuri

Updated On : November 4, 2024 / 11:03 AM IST

Actress Kasthuri : ప్రముఖ నటి కస్తూరి తెలుగు ప్రజలకు సుపరిచితమే. ఆమె పలు తెలుగు సినిమాల్లోనే కాదు.. సీరియల్స్ లోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలుచేస్తూ విమర్శలపాలవుతుంటారు. తాజాగా మరోసారి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై నోరుపారేసుకున్నారు. రాజుల కాలంలో అంత:పుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారని, అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు.

Also Read : Khalistamis Attacked Hindus: కెనడాలో హిందూ భక్తులపై ఖలిస్తానీల దాడి.. ప్రధాని ట్రూడో ఏమన్నాడంటే?

300ఏళ్ల క్రితం ఒకరాజు వద్ద అంత:పుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే.. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దుని బ్రాహ్మణులు చెబుతున్నారు. ఇలా మంచి చెబుతున్నారు కాబట్టే వారికి వ్యతిరేకంగా తమిళనాడులో ప్రచారం సాగుతోంది అంటూ కస్తూరి అన్నారు. కస్తూరి చేసిన వ్యాఖ్యలు తమిళనాడులోనేకాక తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారాయి. తెలుగుజాతిని ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యలు చేపడం పట్ల సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల తీవ్రత పెరగడంతో అదే సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటూ చెప్పుకొచ్చారు.

 

తమిళనాడుకు వచ్చిన కొందరు తెలుగువారు ఇక్కడ బ్రాహ్మణులను తమిళులు కాదంటున్నారని.. దానిపైనే నేను మాట్లాడానని పేర్కొంటూ కస్తూరి ట్వీట్ చేశారు. అయితే, కస్తూరికి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు.. ఆమె గతంలో అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. గతేడాది ఇద్దరు అమ్మాయిలు మద్యం దుకాణం వద్ద మద్యం తీసుకుంటున్న వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన కస్తూరి.. ‘బాగా తాగండి అమ్మాయిలూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాళ్ల పర్సనల్ వీడియోను బహిర్గతం చేయడానికి నువ్వెవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. నయనతార సరోగసి విధానం, ఏఆర్ రెహమాన్ భార్య సైరాభానుకు తమిళం సరిగా రాకపోవడంపై, ఆదిపురుష్ చిత్రంలోని ప్రభాష్ పాత్రపైనా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసి విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఏకంగా తెలుగు జాతిని అవమానపర్చేలా కస్తూరి వ్యాఖ్యలు చేయడంతో.. నువ్వు మారవా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.