Khalistamis Attacked Hindus: కెనడాలో హిందూ భక్తులపై ఖలిస్తానీల దాడి.. ప్రధాని ట్రూడో ఏమన్నాడంటే?
కెనడాలోని బ్రాంప్టన్ హిందూ సభ మందిర్ లోని భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటన సమయంలో మందిర్ లో మహిళలు, పిల్లలుకూడా ఉన్నారు.

Canada PM Trudeau
Canada Temple Attack: కెనడా దేశం బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్ లో భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటన సమయంలో మందిర్ లో మహిళలు, పిల్లలుకూడా ఉన్నారు. నివేదికల ప్రకారం.. ఆలయంలో ఉన్న మహిళలు, పిల్లలపైకూడా దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో కెనడియన్ ఎంపీలుసైతం పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఆలయం వెలుపల ఖలిస్థానీ అనుకూల గ్రూపులతో సంబంధం ఉన్న జెండాలను ప్రదర్శించడంతోపాటు కర్రలతో కొందరు వ్యక్తులు చిన్నారులు, మహిళలపై కూడా దాడి చేస్తున్నట్లు కనిపించింది. అయితే, ఈ ఘటన విషయం తెలుసుకున్న కెనడియన్ పోలీసులు భారీ సంఖ్యలో మందిర్ వద్దకు చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: Canadian Diplomat : అమిత్‌షాపై ఆరోపణలు నిరాధారం.. కెనడా దౌత్యాధికారికి భారత్ సమన్లు
ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. హింసాత్మక సంఘటనలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. కెనడియన్లందరికీ తమ విశ్వాసాన్ని సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది. పోలీసులు తక్షణమే స్పందించి భక్తులను రక్షించారని, ఈ ఘటనపై విచారణ చేపడతామని వెల్లడించారు. ఈ ఘటనను కెనడా పార్లమెంట్ లో ప్రతిపక్షనేత పియరీ పోయిలీవ్రే, ఎంపీలు కెవినక్ష్ వూంగ్, తదితరులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి చర్య ప్రమాదకరమైన తీవ్రవాదంగా అభివర్ణించారు.
కెనడా ఎంపీ చంద్ర ఆర్య ఈ ఘటనపై ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదం ఎంత హింసాత్మకంగా మారిందో ఈ ఘటనను బట్టి అర్ధం అవుతుంది. వారు రెడ్ లైన్ దాటారు. కెనడాలోని భావప్రకటనా స్వేచ్ఛ చట్టాలను ఖలిస్థానీ తీవ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు. వీటన్నింటికీ ఉచిత పాస్ లు పొందుతున్నారని చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశాడు.
A red line has been crossed by Canadian Khalistani extremists today.
The attack by Khalistanis on the Hindu-Canadian devotees inside the premises of the Hindu Sabha temple in Brampton shows how deep and brazen has Khalistani violent extremism has become in Canada.
I begin to feel… pic.twitter.com/vPDdk9oble— Chandra Arya (@AryaCanada) November 3, 2024
Very disturbing images! #Khalistanis have attacked devotees at #HinduSabhaTemple , Brampton. This is unacceptable! @PeelPolice @patrickbrownont @JustinTrudeau @fordnation – Take action and protect Canadians pic.twitter.com/FN18xY2rBT
— HinduForumCanada #HFC (@canada_hindu) November 3, 2024
The acts of violence at the Hindu Sabha Mandir in Brampton today are unacceptable. Every Canadian has the right to practice their faith freely and safely.
Thank you to the Peel Regional Police for swiftly responding to protect the community and investigate this incident.
— Justin Trudeau (@JustinTrudeau) November 3, 2024