కుష్బూపై ఏకంగా 30 స్టేషన్లలో కేసు నమోదు.. క్షమాపణలు చెప్పిన సీనియర్ నటి..

ఒకటి రెండు కాదు ఏకంగా 30 స్టేషన్లలో కేసు..
Kushboo: సెలబ్రిటీలు మీడియా లేదా సోషల్ మీడియా వేదికగా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించకపోతే ఎలాంటి వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పటికే చాలా ఉదంతాలు చూశాం. తాజాగా సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూకు ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఆమె మీద ఏకంగా 30 పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు కావడం విశేషం.
Kushboo ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి చేరారు.
ఈ సందర్భంగా కుష్బూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇన్ని రోజులు నేను మానసిక వికంలాగుల పార్టీలో ఉన్నానని.. అలాంటి పార్టీ నుంచి నేను నిష్క్రమించానంటూ కుష్బూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానపరిచినట్టేనని ఎన్‌పీఆర్‌డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమెపై దాదాపు 30 పీఎస్‌లలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
కుష్బూ క్షమాపణలు..
కాగా బుధవారం సాయంత్రం తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తను ఎవర్నీ కించపరిచే ఉద్దేశంతో అలా అనలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించే విధంగా ఉంటే క్షమించమని కోరారు.
కుష్బూ రాజకీయ ప్రస్థానం..
డీఎంకే పార్జీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కుష్బూ…2014లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తమిళనాడు, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించారు కష్బూ.