Laila – Maheswari : 2 దశాబ్దాలుగా కలవని ఒకప్పటి స్టార్ హీరోయిన్స్.. ఒక్కసారి కూడా కలవకుండా.. ఇన్నాళ్లకు..

ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్స్ తమ 20 ఏళ్ళ కెరీర్ లోఒక్కసారి కూడా కలుసుకోలేదట.

Actress Maheswari Interesting Post with Laila they met first time in Career

Laila – Maheswari : సాధారణంగా హీరోయిన్స్ కి ఒకరికి ఒకరు సంబంధం లేకపోయినా బయట ఈవెంట్స్ లో లేదా ఎక్కడో ఒకచోట కలుస్తూ ఉంటారు. అక్కడ మాట్లాడుకుంటారు, కొంతమంది అలా కూడా ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్స్ తమ 20 ఏళ్ళ కెరీర్ లోఒక్కసారి కూడా కలుసుకోలేదట.

తాజాగా ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి మరో హీరోయిన్ లైలా ఇద్దరూ కలిసి సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోగ్రాం ఎపిసోడ్ కి గెస్టులుగా వచ్చారు. దీంతో ఆ షూట్ లో లైలాతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి మహేశ్వరి ఓ పోస్ట్ పెట్టింది. మహేశ్వరి తన పోస్ట్ లో.. మేమిద్దరం ఒక్కసారి కూడా కలుసుకోలేదు మా కెరీర్స్ మొదలయ్యాక. ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు అయిపొయింది. మేము కలవడానికి రైట్ ప్లేస్, రైట్ టైం కావాలేమో ఫైనల్లీ ఇప్పుడు అది కుదిరింది. ఇన్నాళ్లకు కలిసినందుకు ఆనందంగా ఉంది. నిన్ను ముందే కలిస్తే బాగుండేది. నువ్వు ఒక డార్లింగ్ వి అంటూ లైలా గురించి పోస్ట్ పెట్టింది. దీంతో మహేశ్వరి పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read : Pawan Kalyan : మీరు మారరు.. ఫ్యాన్స్ OG.. OG.. అని రావడంపై పవన్ చురకలు.. నేనేమో దేశం బాగుండాలి అంటే మీరు..

మహేశ్వరి శ్రీదేవి బంధువుగా సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయి తెలుగు, తమిళ్ లో అనేక సినిమాలు చేసింది. తెలుగులో గులాబీ, పెళ్లి, ప్రియరాగాలు, నీకోసం, మా అన్నయ్య.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. 2000 సంవత్సరం తర్వాత సినిమాలు మానేసింది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్, టీవీ షోలు చేసినా 2014 నుంచి వాటికి కూడా దూరమైంది. గత రెండు మూడేళ్ళుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయి ఇప్పుడిప్పుడే టీవీ షోలలోకి వస్తుంది. సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇక లైలా హిందీ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తెలుగు, తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో పెళ్లి చేసుకుందాం, ఎగిరే పావురమా, ఉగాది, నా హృదయంలో నిదురించే చెలి.. లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులకు దగ్గరైంది. 2006 లో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లైలా 2022 లో సర్దార్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సినిమాలు, సిరీస్ లు, టీవీ షోలు చేస్తుంది.

Also Read : Pawan Kalyan : కార్యకర్త కొడుకుని భుజాల మీద కుర్చోపెట్టుకున్న ‘పవన్’.. ఆ పిల్లాడి ఆనందం చూడండి.. వీడియో వైరల్..

ఆల్మోస్ట్ 20 ఏళ్ళ కెరీర్ ఉన్న ఈ ఇద్దరూ కెరీర్లో ఒక్కసారి కూడా కలవలేదు అని మహేశ్వరి పోస్ట్ పెట్టడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి ఈ హీరోయిన్స్ కావడంతో వాళ్ళతో పాటు వారి ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి కనిపించిన సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోగ్రాం ఎపిసోడ్ ప్రోమో కూడా చూసేయండి..