Pawan Kalyan : కార్యకర్త కొడుకుని భుజాల మీద కుర్చోపెట్టుకున్న ‘పవన్’.. ఆ పిల్లాడి ఆనందం చూడండి.. వీడియో వైరల్..

నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్లారు.

Pawan Kalyan : కార్యకర్త కొడుకుని భుజాల మీద కుర్చోపెట్టుకున్న ‘పవన్’.. ఆ పిల్లాడి ఆనందం చూడండి.. వీడియో వైరల్..

Pawan Kalyan Carries his Party Member Son and Holding on his Shoulders Video goes Viral

Updated On : March 22, 2025 / 3:30 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను తన సినిమాలతో, తన మంచితనంతో, తన సేవా కార్యక్రమాలతో సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ గ్రామాల అభివృద్ధి చేస్తుండటంతో అందరూ ఆయన్ని మరింత ఇష్టపడుతున్నారు, అభినందిస్తున్నారు.

నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ పూడిచర్లలో ఫాం పాండ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. మాట్లాడి వెళ్లిపోయే ముందు కార్యకర్తలతో అభివాదం చేసారు.

Also Read : Konidela : మెగాస్టార్ ఇంటిపేరుతో గ్రామం.. కొణిదెల గ్రామం ఎక్కడుందో తెలుసా? దత్తత తీసుకొని 50 లక్షలతో డిప్యూటీ సీఎం పవన్..

ఆ సమయంలో స్టేజి కింద ఓ జనసేన కార్యకర్త తన కొడుకుని పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లాలని ఆరాటపడటం చూసాడు. దీంతో పవన్ ఆ పిల్లాడ్ని స్టేజి పైకి తెప్పించుకొని ఆ పిల్లాడ్ని ఎత్తుకొని తన భుజాలపై కుర్చోపెట్టుకున్నాడు. పిల్లాడు పడిపోకుండా అతని కాళ్ళు పట్టుకొని మరీ జాగ్రత్తగా కుర్చోపెట్టుకున్నాడు. అనంతరం ఎత్తుకొని ఆ పిల్లాడితో పవన్ మాట్లాడారు. ఆ పిల్లాడు పవన్ ఎత్తుకొని మాట్లాడటంతో తెగ సంబరపడిపోయారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఆ వీడియో చూసేయండి..

 

Also See : నా పేరు కంటే.. వెంకటేశ్వర స్వామి పేరు తలుచుకోండి: పవన్ కళ్యాణ్

అంత పెద్ద స్టార్, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఒక కార్యకర్త కొడుకుని అలా భుజాల మీద కుర్చోపెట్టుకోవడం, కాళ్ళు పట్టుకోవడం అంటే మాటలా, అందుకే కదా పవన్ ని అంతా ఇష్టపడతారు అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు, కార్యకర్తలు మరోసారి పవన్ ని అభినందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ జనసేన కార్యకర్త కొడుకుని ఎత్తుకున్న వీడియో వైరల్ గా మారింది.