Pawan Kalyan : మీరు మారరు.. ఫ్యాన్స్ OG.. OG.. అని రావడంపై పవన్ చురకలు.. నేనేమో దేశం బాగుండాలి అంటే మీరు..
ఆ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతుంటే పలువురు ఫ్యాన్స్ OG.. OG.. అని అరిచారు.

Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండటంతో చేతిలో ఉన్న సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపొతున్నాడు. హరిహర వీరమల్లు, OG సినిమాలు ఎలాగైనా పూర్తిచేయలని ట్రై చేస్తున్నాడు. అయితే OG సినిమాపై ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. OG సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్ర చేస్తుండటం, తన మార్షల్ ఆర్ట్స్ ని మళ్ళీ చూపించబోతుండటం, ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ తో సినిమాపై భారీ హైప్ ఉంది.
ఫ్యాన్స్ అంతా OG సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ OG సినిమాకు ఇంకా 20 రోజులు డేట్స్ ఇవ్వాలి. దీంతో పవన్ ఎక్కడ బహిరంగ మీటింగ్ లో పాల్గొన్నా ఫ్యాన్స్ OG.. OG.. అని అరుస్తూ ఉంటారు. ఇప్పటికే పలుమార్లు పవన్ అలా అరవొద్దని ఫ్యాన్స్ ని హెచ్చరించాడు కూడా. అయినా ఆ సినిమా మీదున్న హైప్ తో ఫ్యాన్స్ అరుస్తూనే ఉంటారు.
నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ పూడిచర్లలో ఫాం పాండ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతుంటే పలువురు ఫ్యాన్స్ OG.. OG.. అని అరిచారు.
దీంతో పవన్.. మీరు మారరయ్యా. నేను పల్లె పండగ, పంచాయతీ రాజ్, సీసీ రోడ్లు, దేశం బాగుండాలి అంటే మీరేమో OG.. OG.. అని అరుస్తారు. సరే కానివ్వండి నేను ఏం చేస్తాను. మీ ముందు నా శక్తి సరిపోదు. వీళ్ళు గొడవపెట్టుకుంటే నేను ఆపలేను, వీళ్ళకు నమస్కారాలు పెట్టి తప్పుకోవడం తప్ప ఏం చేయలేను అంటూ నవ్వుతూనే చురకలు అంటించారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మీరు మారరు..🙄
–@PawanKalyan garu..🤣🤣 pic.twitter.com/VoW2OCGsk8
— JanaSena Samhitha (@JSPSamhitha) March 22, 2025