Mouni Roy : ప్రియుణ్ణి పెళ్లాడిన ‘నాగిని’ నటి..

పాపులర్ యాక్ట్రెస్ మౌనీ రాయ్ వెడ్డింగ్, బాయ్‌ఫ్రెండ్ సూరజ్ నంబియార్‌‌తో గోవాలో జరిగింది..

Mouni Roy : ప్రియుణ్ణి పెళ్లాడిన ‘నాగిని’ నటి..

Mouni Roy

Updated On : January 27, 2022 / 1:39 PM IST

Mouni Roy: పాపులర్ బాలీవుడ్ నటి మౌనీ రాయ్ పెళ్లి పీటలెక్కింది. గురువారం తన బాయ్‌ఫ్రెండ్ సూరజ్ నంబియార్‌తో ఆమె వివాహం జరిగింది. గోవాలో మలయాళీ సాంప్రదాయం ప్రకారం మౌనీ-సూరజ్ ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

దుబాయ్‌లో సెటిల్ అయిన సూరజ్‌తో గతకొంత కాలంగా రిలేషన్‌లో ఉంది మౌనీ రాయ్. టీవీ, సినీ నటిగా, సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మౌనీ రాయ్. ముఖ్యంగా ‘నాగిన్’ సీరియల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. తెలుగులో ‘నాగిని’ పేరుతో టెలికాస్ట్ చేశారు. అభిషేక్ బచ్చన్ ‘రన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

‘కె.జి.యఫ్’ లోనూ స్పెషల్ సాంగ్ చేసింది (హిందీ వర్షన్). మౌనీ రాయ్ మ్యారేజ్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు మౌనీ రాయ్-సూరజ్ నంబియార్ కపుల్‌కి విషెస్ తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)