బ్లాక్ మెయిల్ చేసిన నెటిజన్.. ఫోటో పెట్టి వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్

తన పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డిన ఓ వ్యక్తి ఫోటోను తన ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో బహిర్గతం చేసింది ప్రముఖ హీరోయిన్ నమిత. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఆమె.. ఓ నెటిజన్ ఆన్ లైన్ లో తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ నమిత ఓ ఫోటో ఇన్ స్టాగ్రమ్‌లో పెట్టి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సెంటమిజ్ అనే ఓ నెటిజన్ సోషల్ మీడియాలో తనకు డైరెక్ట్ మెసేజ్‌లు చేస్తూ.. అసభ్యకరంగా పిలవడం ప్రారంభించినట్లు ఆమె వెల్లడించింది. ‘హాయ్ ఐటమ్’ అంటూ నీచంగా సంబోధించాడంటూ ఆమె ఆరోపించింది. దీనిపై తాను ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తన అకౌంట్ హ్యాక్ అయిందని బుకాయించినట్లు ఆమె చెప్పింది. ఈ విషయంలో అతన్ని గట్టిగా నిలదీయడంతో చివరకు తన పోర్న్ వీడియోలు ఉన్నాయయంటూ బెదిరించాడని, వాటిని ఆన్‌లైన్‌లో పెడతానని అన్నాడంటూ వెల్లడించింది.
అందులో నిజమెంతో తనకు తెలుసుకాబట్టి.. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పినట్లు చెప్పుకొచ్చింది. కేవలం మీడియాలో, గ్లామర్ ప్రపంచంలో ఉన్నంత మాత్రాన తన గురించి మొత్తం తెలుసని మీరు అనుకుంటున్నారా? ఓ వ్యక్తిగా నా గురించి మీకేం తెలుసు? అంటూ నమిత ప్రశ్నించింది. తన నిశ్శబ్దాన్ని బలహీనత అనుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది నమిత.
‘నవరాత్రుల సందర్భంగా 9 రోజులు దుర్గా మాతను పూజించే బదులు, అలాగే మహిళా దినోత్సవాన్ని జరుపుకునే బదులు సమాజంలో మహిళలను ఎలా గౌరవించాలో నేర్చుకోండి. ఎందుకంటే జీవితంలో ఇది అతి ముఖ్యమైనది’ అని నమిత అన్నారు.