Actress Nidhi Agarwal says that Prabhas is not a pan-India star.
Nidhi Agarwal: ప్రస్తుతం ఇండియా లెవల్లో ఒక రేంజ్ స్టార్డమ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. పాన్ ఇండియా అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే చాలా మంది ప్రభాస్ పేరే చెప్తారు. దానికి కారణం, ఆయన సినిమాలకు భాషతో సంబంధం లేదు. ఎక్కడ ఆడియన్స్ ఆయన్ని తమ సొంత హీరోలా ఫీలవుతారు. అందుకే, ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇండియన్ సినీ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. అలాంటి ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ కాదు అంటుంది లేటెస్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Lokesh Kanagaraj: ప్లాప్ మూవీ ప్రభావం అలా ఉంటుంది.. ఎన్నో విమర్శలు అంటూ.. లోకేష్ ఎమోషనల్ కామెంట్స్
నిధి అగర్వాల్ హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కించాడు. హారర్ అండ్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ది రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు మూవీ టీం. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, ఈ ఇంటర్వ్యూలో యాంకర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగాడు.
దానికి సమాధానంగా నిధి మాట్లాడుతూ.. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదు.. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది. దాంతో, నాలుక కరుచుకున్న యాంకర్ మళ్ళీ తన మాటలను సరరించుకున్నాడు. దీంతో నిధి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి నిధి చేసిన ఈ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.