కాంచన- 3 నటికి వేధింపులు : సహనటుడు అరెస్ట్

కాంచన-3 సినిమాలో నటించిన నిక్కీ టాంబోలి తనను నటుడు రుబేశ్ కుమార్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది..

  • Publish Date - April 25, 2019 / 09:33 AM IST

కాంచన-3 సినిమాలో నటించిన నిక్కీ టాంబోలి తనను నటుడు రుబేశ్ కుమార్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది..

ఇటీవల రిలీజ్ అయిన కాంచన-3 సినిమాలో నటించిన నిక్కీ టాంబోలి లైంగిక వేధింపులకు గురైంది. చీకటి గదిలో చితక్కొట్టుడు, తిప్పరా మీసం వంటి సినిమాల్లో నటించిన నిక్కీ, తనను నటుడు రుబేశ్ కుమార్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. రష్యాకు చెందిన నిక్కీ, సినిమాలతో పాటు పలు యాడ్స్‌లోనూ నటించింది.

తను యాడ్స్‌లో నటిస్తున్నప్పుడు, తన సహ నటుడైన రుబేశ్, తనకు అవకాశాలిప్పిస్తానని చెప్పి, తనను రకరకాలుగా ఫోటోలు తీసాడని, తిరిగి వాటిని రోజూ తనకు వాట్సాప్‌లో పంపుతూ, కోరిక తీర్చాలనీ, లేదంటే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడనీ నిక్కీ టాంబోలి ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ నోట్ చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు రుబేశ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Also Read : కూతురు హీరోయిన్‌గా ఏంట్రీ ఇస్తుంటే, తండ్రి మళ్ళీ ‘తండ్రి’ అయ్యాడు