కూతురు హీరోయిన్‌గా ఏంట్రీ ఇస్తుంటే, తండ్రి మళ్ళీ ‘తండ్రి’ అయ్యాడు

త్వరలో గాబ్రియోలాకి పండంటి బిడ్డ పుట్టబోతుందని, ఆమెని తన గుండెలకు హత్తుకున్న ఫోటోని అర్జున్ రాంపాల్ షేర్ చేసాడు.

  • Published By: sekhar ,Published On : April 25, 2019 / 08:16 AM IST
కూతురు హీరోయిన్‌గా ఏంట్రీ ఇస్తుంటే, తండ్రి మళ్ళీ ‘తండ్రి’ అయ్యాడు

త్వరలో గాబ్రియోలాకి పండంటి బిడ్డ పుట్టబోతుందని, ఆమెని తన గుండెలకు హత్తుకున్న ఫోటోని అర్జున్ రాంపాల్ షేర్ చేసాడు.

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ గురించి కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేదు. గతకొద్ది రోజులుగా అర్జున్ పేరు మీడియాలో జోరుగా వినబడుతుంది. రీజన్ ఏంటంటే.. అతను మరోసారి తండ్రికాబోతున్నాడు. అదికూడా పెళ్ళి కాకుండా తండ్రికావడం విశేషం.. మొదట అర్జున్ తన 26వ ఏట, మెహర్ జెస్సియాని పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ జంట తమ 20 ఏళ్ళ దాంపత్య జీవితానికి 2018లో ఫుల్ స్టాప్ పెట్టేసారు. కట్ చేస్తే, గతకొద్ది రోజులుగా అర్జున్, సౌతాఫ్రికాకు చెందిన మోడల్ గాబ్రియోలాతో సహజీవనం చేస్తున్నాడు. 2009లో ‘మిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాలీవుడ్‌’లో పాల్గొన్న టైమ్‌లో గాబ్రియోలాతో మనోడికి పరిచయం ఏర్పడింది..

Image result for arjun rampal daughter

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, వీళ్ళ ప్రేమకు గుర్తుగా గాబ్రియోలా ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు అర్జున్.. త్వరలో ఆమెకి పండంటి బిడ్డ పుట్టబోతుందని, ఆమెని తన గుండెలకు హత్తుకున్న ఫోటోని అర్జున్ షేర్ చేసాడు. అర్జున్ మొదటిభార్య కూతురు మహికా త్వరలో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అరంగేట్రం చెయ్యబోతుంది. హీరోయిన్ అవుతున్న కూతురుండగా, అర్జున్ రాంపాల్‌కి ఇదేం పని.. అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తుంది. 
Also Read : పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే : గంటకు మించి ఫోన్లు ఇస్తే రిస్క్