తట్టుకోలేకపోయాను.. అందుకే చనిపోతున్నానని చెప్పాను: సినీనటి ప్రగతి

"సినిమాలు లేకపోతే నేను లేను. నేను మామూలు ఆర్టిస్టును కూడా కాదు" అని ప్రగతి తెలిపారు.

తట్టుకోలేకపోయాను.. అందుకే చనిపోతున్నానని చెప్పాను: సినీనటి ప్రగతి

Pragathi

Updated On : December 22, 2025 / 6:14 PM IST

Pragathi: “నేను సెట్‌లోనే చనిపోతా..” అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై సినీ నటి ప్రగతి స్పందించారు. 10టీవీ పాడ్‌కాస్ట్‌లో ప్రగతి మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

“ఎందుకలా చెప్పాల్సి వచ్చిందంటే.. నేను సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్‌కి వెళ్లిపోయానని చాలా మంది అన్నారు. నాకు చాలా బాధగా అనిపించింది. వాళ్లు హెల్ప్ చేయకపోవడమేగాక ఉన్నది కూడా ఊడగొడుతున్నారన్న ఫీలింగ్ వచ్చింది.. అది కరెక్ట్ కాదు.

సినిమాలు లేకపోతే నేను లేను. నేను మామూలు ఆర్టిస్టును కూడా కాదు. నేను చాలా మంచి ఆర్టిస్టుని. నేను ఇప్పటిదాకా చేసిన ప్రతి క్యారెక్టర్‌కు ప్రాణం పోశాను. నేను రెండు సార్లు నంది అవార్డు అందుకున్నాను. ఐ యమ్ రీజనబులీ వెరీ గుడ్ యాక్టర్.. నేను అంత కచ్చితంగా, అంత ప్రొఫెషనల్‌గా చేసేటప్పుడు నేను సినిమాలు మానేసి వెళ్లిపోయానని అన్నారు.

వాళ్లకు వాళ్లుగా ఊహించుకుని అనడం నాకు నచ్చలేదు. సో అందుకని స్ట్రాంగ్ గా చెప్పడం కోసం అలా అన్నాను. సినిమాల్లో నటించడం మానే ప్రసక్తే లేదు.. నేను చచ్చినా.. లాస్ట్ మినిట్ సినిమా సెట్లోనే చస్తాను కానీ ఇంకెక్కడా కాదు. అంటే నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకున్నాను. ఏదేమైనా నేను సినిమాను వదులుకోను. ఈ విషయాన్ని చాలా లౌడ్‌గా, క్లియర్‌గా చెబితేనే అందరికీ వెళ్తుంది. అందుకని చెప్పాలి” అని అన్నారు.