Actress Pragathi Mahavadi Wins Silver Medal in South India Power Lifting Champion Ship
Pragathi Mahavadi : నటి ప్రగతి ఎన్నో సినిమాల్లో అమ్మ, అత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం. ఇప్పుడు కూడా రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ప్రగతి చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ రోజుకి 8 గంటలు జిమ్ లోనే వర్కౌట్స్ చేస్తానని ప్రగతి ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపింది. గతంలో చాలా సార్లు జిమ్ లో ప్రగతి వర్కౌట్ వీడియోలు, ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి.
ఆ వర్కౌట్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే పలువురు ఈ వయసులో ఇవన్నీ అవసరమా అంటూ విమర్శలు చేశారు. కానీ ప్రగతి అవేమి పట్టించుకోకుండా బాడీ బిల్డ్ చేసే పనిలో పడింది. అయితే ఇంత కష్టం ఎందుకో ఇప్పుడు అందరికి తెలిపింది. ఇటీవల జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ సీనియర్, జూనియర్ కాంపిటీషన్స్ 2024లో ప్రగతి పాల్గొంది. ఈ పోటీల్లో సిల్వర్ పతకం సాధించి ప్రగతి రెండో ప్లేస్ లో నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Also Read : Anna Ben : ప్రభాస్ ‘కల్కి’లో మలయాళం స్టార్ హీరోయిన్.. ఇంకెంతమందిని తెస్తారు బ్రో..
ప్రగతి 47 ఏళ్ళ వయసులో ఇంత కష్టపడి పవర్ లిఫ్టింగ్ లో ఏకంగా సౌత్ ఇండియన్ చాంప్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రలువురు ప్రముఖులు, నెటిజన్లు ప్రగతికి కంగ్రాట్స్ చెప్తున్నారు. త్వరలో నేషనల్ ఛాంపియన్ షిప్ లో కూడా ప్రగతి పాల్గొంటుందని సమాచారం. ఈ వయసులో ప్రగతి ఓ పక్క యాక్టింగ్ చేస్తూ మరో పక్క తన బాడీ బిల్డ్ మీద ఫోకస్ చేసి ఇలా ఛాంపియన్ షిప్ లో పాల్గొని గెలవడం అంటే మాములు విషయం కాదు, ఎంతోమంది మహిళలకు ఆమె ఆదర్శం.