×
Ad

ఒరేయ్ దమ్ముంటే నాతో ఫేస్‌ టు ఫేస్‌ రండ్రా: సినీనటి ప్రగతి

"నాది భయం కాదు. అది ఆవేదన, అసహ్యం. నేను అలా ఫీల్ అయ్యేలా చేశారు" అని తెలిపారు.

Pragathi

Pragathi: సామాజిక మాధ్యమాల్లో జరిగే ట్రోలింగ్‌పై తాను గతంలో స్పందించిన తీరుపై సినీనటి ప్రగతి క్లారిటీ ఇచ్చారు. 10టీవీ పాడ్‌కాస్ట్‌లో ప్రగతి మాట్లాడుతూ దీనిపై స్పందించారు.

“నాది భయం కాదు. అది ఆవేదన, అసహ్యం. నేను అలా ఫీల్ అయ్యేలా చేశారు. జిమ్‌లో నేను అంత దరిద్రంగా ఏమీ చేయట్లేదు. నేను జిమ్‌కు వెళ్తున్నాను.. వ్యాయామం చేసుకుంటున్నాను.. నేను చేసే దాంట్లో సగంలో సగం కూడా ఒక్కొక్కడు చేయలేడు. అయినా కూడా ఆ వీడియోల కింద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు.

నాకు ఇది అవసరమా? అని అంటున్నారు. ఇంటిపని చేసుకోవచ్చుగా? అని కామెంట్లు పెట్టారు. ఇంటి పని చేయడానికి పనోళ్లు ఉన్నారురా బాబు. నాకు ఇష్టం వచ్చింది నేను చేసుకుంటున్నాను. నా డబ్బులు నేను కట్టుకుంటున్నాను. నాది నేను చేసుకుంటున్నాను. నేను ఒక్క కామెంట్‌ గురించే చెప్పాను. ఇంతకంటే దరిద్రంగా చాలా కామెంట్స్ పెట్టారు.

ముక్కూమొహం తెలియనోడు.. ఎవడికి పుట్టాడో తెలియదు.. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు.. వాడు ఎవడో.. తెలియదు వాడి అడ్రెస్ లేదు.. వాడు ఫొటో కూడా పెట్టుకోడు.. వాడి ప్రొఫైల్లో వాడికి ఫాలోయింగ్ ఉండదు. వాడు మాత్రం 7,000 మందిని ఫాలో చేస్తాడు. వాళ్లందరినీ మాక్ చేస్తూ ఉంటాడు. ఇది సరికాదు.

అంత దమ్ము ఉన్నోడైతే.. ఒరిజినల్ ఫొటో పెట్టుకుని, పేరు పెట్టుకుని, ఫోన్ నంబర్ రాయాలి. కామెంట్స్ అన్నీ నెగిటివ్‌గానే ఉంటున్నాయి. వాళ్లు నా పిల్లల వయసు ఉంటారు.. పద్ధతి లేదు. అంటే ఒక తల్లికి మర్యాద లేదా? ఒక అక్కకు మర్యాద లేదా? వీళ్లని ఏమీ చేయలేం.

ఏదో సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక మాట అనడమే గానీ.. ఏమీ చేయలేం. అలాంటి కామెంట్లు పెట్టేవాడిని ముఖాముఖిగా నా ముందు కూర్చొని ఒకసారి మాట్లాడమనండి. నేను ఆన్సర్ చేస్తాను. వాడికి ఉన్న ప్రశ్నలు ఏంటో అడుగుతాను?” అని అన్నారు.

Also Read: తట్టుకోలేకపోయాను.. అందుకే చనిపోతున్నానని చెప్పాను: సినీనటి ప్రగతి