Parvin Dabas : కారు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్ భర్త.. ఐసీయూలో చికిత్స..

ఇవాళ ఉదయం పర్వీన్ దబాస్ కార్ లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది.

Actress Preeti Jhangiani Husband Admit in ICU After Car Accident

Parvin Dabas : తాజాగా బాలీవుడ్ భామ ప్రీతీ జంగ్యాని భర్తకు యాక్సిడెంట్ కి గురయి హాస్పిటల్ లో చేరారు. తెలుగులో తమ్ముడు, నరసింహ నాయుడు.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన ప్రీతీ జంగ్యాని ఆ తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు పర్వీన్ దబాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భామ.

ఇవాళ ఉదయం పర్వీన్ దబాస్ కార్ లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. వెంటనే అతన్ని బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం పర్వీన్ కి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పర్వీన్ ప్రో పంజా లీగ్ కో ఫౌండర్ కూడా. ప్రో పంజా లీగ్ సభ్యులు పర్వీన్ దబాస్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతను చికిత్సకు రెస్పాండ్ అవుతున్నారు. అతని ఆరోగ్యం గురించి మేము రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తాము అని తెలిపారు.

Also Read : Soniya – Nikhil : సోనియా చెప్తే నేను ఎందుకు మానెయ్యాలి.. నిఖిల్ సోనియా రిలేషన్ షిప్ ఏంటి..?

ఇక భర్త యాక్సిడెంట్ కి గురయ్యాడని తెలిసి ప్రీతీ జంగ్యాని హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్ళింది. అతని ఫ్యామిలీ మెంబర్స్, ప్రో పంజా లీగ్ మెంబర్స్ ప్రస్తుతం హాస్పిటల్ ల్లోనే ఉన్నారు. అభిమానులు, పలువురు సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.