Soniya – Nikhil : సోనియా చెప్తే నేను ఎందుకు మానెయ్యాలి.. నిఖిల్ సోనియా రిలేషన్ షిప్ ఏంటి..?

కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఏదో ఒక జంట వైరల్ అవుతుంది. ఈ సారి అది నిఖిల్ - సోనియా జంట అయింది.

Soniya – Nikhil : సోనియా చెప్తే నేను ఎందుకు మానెయ్యాలి.. నిఖిల్ సోనియా రిలేషన్ షిప్ ఏంటి..?

What is The Relation Between Soniya and Nikhil in Bigg Boss Season 8 Pair goes Viral

Updated On : September 21, 2024 / 12:00 PM IST

Soniya – Nikhil : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మూడో వారం సాగుతుంది. ప్రతి సీజన్ లోను ఓ అమ్మాయి – అబ్బాయి మధ్య రిలేషన్ ఉంది అని జనాలు అనుకునేలా బిగ్ బాస్ సాగుతుంది. కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఏదో ఒక జంట వైరల్ అవుతుంది. ఈ సారి అది నిఖిల్ – సోనియా జంట అయింది.

మొదటి వారం కొద్దిగా ఎడమొహం పెడమొహం ఉన్న నిఖిల్ సోనియా ఆ తర్వాత క్లోజ్ అయిపోయారు. హౌస్ లో వీరిద్దరి క్లోజ్ నెస్ చూసి ఈ సీజన్ లో వీళ్ళే జంట అవుతారు అని అనుకున్నారు. ఇక ఒకరికొకరు దగ్గరగా కుర్చొవడం, ఒకర్నొకరు తలా నిమురుకోవడం, క్లోజ్ గా మాట్లాడుకోవడం.. ఇవన్నీ చూసి బిగ్ బాస్ చూసేవాళ్లంతా వీళ్ళే ఈ సీజన్ జంట అనుకున్నారు.

Also Read : Balakrishna – Venkatesh : సినిమా షూటింగ్‌లో.. వెంకీ మామతో బాలయ్యబాబు ముచ్చట్లు.. ఎక్కడో తెలుసా..?

ఇక నిన్నటి ఎపిసోడ్ లో అయితే సోనియా.. నిఖిల్ తో నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని చెప్పడం గమనార్హం. నిఖిల్ సిగరెట్ తాగినందుకు సోనియా హర్ట్ అయి ఈ మాట అంది. ఆ తర్వాత నిఖిల్ అభయ్ దగ్గరికి వచ్చి.. చాలా మంది చెప్పారు అయినా మానలేదు. ఈమె చెప్పగానే నేను ఎందుకు మానేస్తాను అని అన్నాడు. దీంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. అటు సోనియా అభయ్ దగ్గరికి వచ్చి నిఖిల్ సుద్దపూస అన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు అని తనతో రెండు రోజులు మాట్లాడాను, అతనికి అసలు నిర్ణయాలు తీసుకోవడమే రాదు అని చెప్పింది.

మళ్ళీ కాసేపటికే సోనియా వెళ్లి నిఖిల్ కి సారి చెప్పింది. మళ్ళీ నిఖిల్ తన దగ్గరున్న రెడ్ ఎగ్ ని సోనియాకు ఇవ్వడం గమనార్హం. వీటికంటే ముందు వీళ్లిద్దరు నాన్న, బుజ్జి, కన్నా.. అని ప్రేమగా పిలుచుకోవడం, నన్ను దత్తత తీసుకో నువ్వు నా తల్లిలాగా ఉండు అని నిఖిల్ సోనియాతో అనడంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. ఒక సారి లవర్స్ లాగా మాట్లాడుకుంటారు, ఒకసారి ఒకర్నొకరు తిట్టుకుంటారు, మళ్ళీ తల్లి కొడుకుల ప్రేమ లాగా మాట్లాడుకుంటారు .. ఏంటో వీళ్ళ రిలేషన్ అని ఆడియన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే బిగ్ బాస్ ఈ జంటని హైలెట్ చేసింది. మరి ఈ జంట కాకుండా ఈ సీజన్ లో ఇంకో జంటని ఎవర్నైనా హైలెట్ చేస్తారేమో చూడాలి.