Balakrishna – Venkatesh : సినిమా షూటింగ్‌లో.. వెంకీ మామతో బాలయ్యబాబు ముచ్చట్లు.. ఎక్కడో తెలుసా..?

తాజాగా మరోసారి వెంకటేష్, బాలకృష్ణ కలిసి సందడి చేసారు.

Balakrishna – Venkatesh : సినిమా షూటింగ్‌లో.. వెంకీ మామతో బాలయ్యబాబు ముచ్చట్లు.. ఎక్కడో తెలుసా..?

Balakrishna Meets Venkatesh in Film Shooting Photos goes Viral

Updated On : September 21, 2024 / 10:45 AM IST

Balakrishna – Venkatesh : ఇటీవల బాలయ్య 50 సంవత్సరాల నటన వేడుకల్లో బాలకృష్ణ కోసం చిరంజీవి, వెంకటేష్ హాజరయి సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వెంకటేష్, బాలకృష్ణ కలిసి సందడి చేసారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ చేసే సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అయితే బాలకృష్ణ బాబీ సినిమా షూటింగ్ కూడా అక్కడే రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుండటంతో నేడు బాలకృష్ణ వెంకటేష్ సినిమా సెట్స్ కి వెళ్లారు.

Also Read : Akkineni Family : అక్కినేని వారసుల మంచితనం, మర్యాద.. ఇది కదా అక్కినేని వారసత్వం అంటే..

వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టాడు బాలయ్య బాబు. షూటింగ్ లో కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. బాలకృష్ణ సెట్ లో ఉన్నవారందర్నీ పలకరించాడు. వెంకీమామతో కలిసి స్పెషల్ గా ఫోటో దిగారు బాలయ్య బాబు. ఇక అనిల్ రావిపూడితో బాలయ్య భగవంత్ కేసరి సినిమా తీసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

Image

బాలకృష్ణ – వెంకటేష్ ఇలా కలిసి కనిపించడం, సినిమా షూటింగ్ సెట్ లో ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకోవడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్, నెటిజన్లు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.