Raasi : రంగమ్మత్తగా రాశీ ఎందుకు చెయ్యలేదంటే..!

కొన్ని సినిమాల్లో కొన్ని కీ క్యారెక్టర్లకు ఎప్పుడూ స్పెషల్‌ ఐడెంటిటీ ఉంటుంది.. అలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసి ఓవర్ నైట్స్ స్టార్స్ అయిన వాళ్లు, నటులుగా గుర్తింపుతో పాటు స్టార్‌డమ్ సంపాదించుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు..

Raasi : రంగమ్మత్తగా రాశీ ఎందుకు చెయ్యలేదంటే..!

Raasi

Updated On : August 13, 2021 / 3:40 PM IST

Raasi: కొన్ని సినిమాల్లో కొన్ని కీ క్యారెక్టర్లకు ఎప్పుడూ స్పెషల్‌ ఐడెంటిటీ ఉంటుంది. అలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసి ఓవర్ నైట్స్ స్టార్స్ అయిన వాళ్లు, నటులుగా గుర్తింపుతో పాటు స్టార్‌డమ్ సంపాదించుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి రేర్ రోల్స్‌లో ‘రంగస్థలం’ రంగమ్మత్త క్యారెక్టర్ ఒకటి.

Ram Charan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెట్లైపోద్ది’.. రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన కల్ట్ క్లాసిక్ ‘రంగస్థలం’ 2018లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిట్టిబాబుగా రామ్ చరణ్, రామలక్ష్మీగా సమంత పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్ అయ్యాయి. ఈ మూవీలో మరో లీడ్ క్యారెక్టర్ రంగమ్మత్త.. స్టార్ యాంకర్ అనసూయ రంగమ్మత్తగా అదరగొట్టేసింది.

Rangasthalam

పక్కా విలేజ్ వుమెన్‌లా కట్టు, బొట్టు, యాసతో అనసూయ నటన ప్రేక్షకులను ఆకట్టకుంది. ఈ సినిమాతోనే రంగమ్మత్తగా మరింత పాపులర్ అవడంతో పాటు క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది అనసూయ. అయితే ఈ క్యారెక్టర్ కోసం ముందుగా డైరెక్టర్ సుకుమార్ పాపులర్ అండ్ సీనియర్ హీరోయిన్‌ని అప్రోచ్ అయ్యారట. క్యారెక్టర్ నచ్చినా కొన్ని అభ్యంతరాలతో ఆమె నో అనడంతో అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్‌కి ఫిక్స్ చేశారట.

Ram Charan : వరుస సినిమాలతో చరణ్ బిజీ..

ఆ యాక్ట్రెస్ ఎవరో కాదు.. బాలనటిగా అలరించి, తర్వాత హీరోయిన్‌గానూ తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న అందాల రాశి.. పెళ్లి తర్వాత మహేష్ బాబు ‘నిజం’ సినిమాలో నెగెటివ్ రోల్, ‘వెంకీ’ లో స్పెషల్ సాంగ్ చేసి సర్‌ప్రైజ్ చేసిన రాశికి తర్వాత పలు ఆఫర్లు వచ్చినా వేటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

Anasuya

సుకుమార్, రంగమ్మత్త రోల్ గురించి చెప్పగానే బాగా నచ్చిందని చెప్పిన రాశీ.. క్యారెక్టర్ పరంగా కొద్దిపాటి ఎక్స్‌పోజింగ్ అలాగే మోకాలిపైకి చీర కట్టుకోవడం లాంటి చెయ్యాల్సి రావడంతో.. రంగమ్మత్త క్యారెక్టర్ చెయ్యలేనని చెప్పేసిందట. దీంతో యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్‌ని ఈ పాత్ర కోసం తీసుకున్నారు మేకర్స్. రంగమ్మత్త అంటే అనసూయ అనేంతగా ఆ క్యారెక్టర్‌లో మెప్పించింది అనసూయ.

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..