Radhika Apte: డైరెక్టర్‌గా మారతానంటోన్న బాలయ్య హీరోయిన్..?

తమిళంలో ‘ధోని’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రాధికా ఆప్టే, ఆ తరువాత పలు భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ సినిమాలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అటుపై బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్‌గా మారింది.

Actress Radhika Apte To Turn Director

Radhika Apte: తమిళంలో ‘ధోని’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రాధికా ఆప్టే, ఆ తరువాత పలు భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ సినిమాలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అటుపై బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్‌గా మారింది.

Radhika Apte : నా భర్త అక్కడ.. నేను ఇక్కడ.. పెళ్లయి పదేళ్లు అయినా..

అయితే ఈ బ్యూటీ బాలీవుడ్‌లో పలు వివాదాలకూ కేరాఫ్‌గా నిలిచింది. బోల్డ్ యాక్టింగ్‌తో పలు విమర్శలు ఎదుర్కొంది ఈ బ్యూటీ. అయితే పెళ్లి తరువాత సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేస్తూ వచ్చిన రాధికా ఆప్టే, ఇప్పుడు డైరెక్టర్‌గా మారేందుకు రెడీ అవుతోంది. ఇప్పటివరకు ఇతర డైరెక్టర్ల సినిమాల్లో యాక్ట్ చేసిన తనకు ముందునుండీ డైరెక్టర్ కావాలనే కోరిక ఉండేదని రాధికా ఆప్టే తెలిపింది. ఓ షోలో పాల్గొన్న రాధికా, ఈమేరకు కామెంట్స్ చేసింది. అయితే తనకు దర్శకత్వం చేయడం అంటే ఇష్టమని.. త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నట్లు ఆమె తెలిపింది.

Radhika Pandit : నా జీవితాన్ని అద్భుతంగా మార్చావు.. KGF స్టార్ యష్ భార్య ఎమోషనల్ పోస్ట్..

ఇక స్క్రీన్‌ప్లే విషయంలో తాను ట్రెయినింగ్ తీసుకోవాలని చూస్తున్నానని.. అందుకే పాపులర్ డైరెక్టర్స్ వద్ద తాను పనిచేయాలని చూస్తోందట. ఇప్పటికే తాను కొన్ని కథలను రెడీ చేశానని.. టాప్ హీరోలతో తాను సినిమాలు చేస్తానని రాధికా చెప్పుకొచ్చింది. అయితే తాను యాక్టింగ్ మాత్రం మానేది లేదని.. తన ఫస్ట్ ప్రయారిటీ యాక్టింగ్‌కే అని రాధికా చెప్పుకొచ్చింది. ఏదేమైనా రాధికా ఆప్టే హీరోయిన్ నుంచి డైరెక్టర్‌గా మారాలని చూస్తుండటంతో, ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.