Radhika Apte : నా భర్త అక్కడ.. నేను ఇక్కడ.. పెళ్లయి పదేళ్లు అయినా..

రాధిక ఆప్టే 2012లోనే బ్రిటిష్ మ్యూజిక్ డైరెక్టర్ బెనెడిక్ట్ టేలర్ ని వివాహం చేసుకుంది. పెళ్లయి పదేళ్లు అవుతుంది. అయినా భర్తతో ఎక్కువగా కనపడదు. తన భర్తతో ఉన్న ఫోటోలు షేర్ చేసుకోదు. ఇదే విషయంపై ఇటీవల............

Radhika Apte :  నా భర్త అక్కడ.. నేను ఇక్కడ.. పెళ్లయి పదేళ్లు అయినా..

Radhika Apte

Radhika Apte :  బాలీవుడ్‌ బోల్డ్ హీరోయిన్ రాధిక ఆప్టే తెలుగులో లయన్, లెజెండ్ సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది. ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్, ఫొరెన్సిక్‌… లాంటి వరుస బాలీవుడ్ చిత్రాలతో మెప్పిస్తూ అక్కడ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం విక్రమ్ ‌వేదా రీమేక్ సినిమాలో నటిస్తోంది రాధిక. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా రెడీ అంటుంది. బోల్డ్ పాత్రలతో మరింత రెచ్చిపోతుంది. సినిమాల గురించి అన్ని విషయాలు షేర్ చేసుకున్నా పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేసుకోదు.

 

రాధిక ఆప్టే 2012లోనే బ్రిటిష్ మ్యూజిక్ డైరెక్టర్ బెనెడిక్ట్ టేలర్ ని వివాహం చేసుకుంది. పెళ్లయి పదేళ్లు అవుతుంది. అయినా భర్తతో ఎక్కువగా కనపడదు. తన భర్తతో ఉన్న ఫోటోలు షేర్ చేసుకోదు. ఇదే విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే మాట్లాడుతూ.. ”నేను ఇక్కడ ఉంటాను. బెనెడిక్ట్‌ అక్కడ ఉంటాడు. మేమే ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం. నా వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడం నాకు అంతగా ఇష్టముండదు. నాకు ఫొటోలపై అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నాకన్న బెన్‌ కి ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు, ఫొటోలు అంటే అస్సలు కోపరేట్‌ చేయ్యడు. అందుకే మా పెళ్లి అయి పదేళ్లు అవుతున్నా మావి ఎక్కువ ఫోటోలు ఉండవు. అసలు మా పెళ్లి ఫొటోలు కూడా లేవు. మా పెళ్ళికి చాలా తక్కువ మందిని పిలిచాం. మా స్నేహితుల్లో సగం మంది ఫొటోగ్రాఫర్లే, అయినా మా ఇద్దరికీ ఫొటోలు దిగేంత ఆసక్తి లేదు” అని తెలిపింది.

Ram Charan: చరణ్ కోసం ఒకప్పటి రొమాంటిక్ హీరో..?

పెళ్లయి పదేళ్లుగా రాధికా ఇక్కడ, బెనెడిక్ట్ ఇంగ్లాండ్ లో ఉంటూ ఎప్పుడో ఒకసారి కలుసుకుంటూ ఇంకా బంధం కొనసాగిస్తున్నారంటే గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. ఈ జంట మరి రెగ్యులర్ గా ఎప్పుడు కలుస్తారో అని ఎదురు చూస్తున్నారు.