Ram Charan: చరణ్ కోసం ఒకప్పటి రొమాంటిక్ హీరో..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా...

Ram Charan: చరణ్ కోసం ఒకప్పటి రొమాంటిక్ హీరో..?

Madhavan In Ram Charan Shankar Movie

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై యావత్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది.

Ram Charan: నయా లుక్‌లో చరణ్ రచ్చ..!

తాజాగా ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన మాధవన్, ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో మాధవన్ లుక్స్ పరంగా కూడా చాలా కొత్తగా కనిపిస్తాడని, ఆయన పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇటీవల రాకెట్రీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాధవన్, ఇప్పుడు చరణ్ కోసం వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Ram Charan: మళ్లీ అమృత్‌సర్ చెక్కేస్తున్న చరణ్.. ఈసారి దేనికో తెలుసా?

ఇక పొలిటికల్ సబ్జెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాలో చరణ్ పాత్ర ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో మాధవన్ నిజంగానే నటిస్తున్నారా లేక ఇది కేవలం పుకారేనా అనేది తేలాల్సి ఉంది.