Rambha : ‘రంభ’ రీ ఎంట్రీ అదిరింది.. ‘సుధీర్’తో బావగారు బాగున్నారా అంటూ.. రంభ కోసం పాట పడిన సుధీర్.. ప్రోమో వైరల్..

90వ దశకంలో స్టార్ హీరోయిన్స్ లో రంభ ఒకరు.

Actress Rambha Re entry in Super Serial Championship TV Show Sudheer Sing a Song Promo goes Viral

Rambha : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తుంది. పెళ్లి, పిల్లలతో సినిమాల్లో గ్యాప్ తీసుకున్న రంభ ఆల్రెడీ తమిళ్ టీవీ షోలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. రంభ సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షోలో ఓ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేసారు.

ఇందులో రంభకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రంభతో పాటు బొంబాయి ప్రియుడు సినిమాలో నటించిన JD చక్రవర్తి కూడా ఈ షోకి వచ్చి సందడి చేసాడు. అలాగే సుడిగాలి సుధీర్ కూడా ఈ షోలో వచ్చి అలరించాడు. సుధీర్ మంచి సింగర్ అని కూడా తెలిసిందే. ఈ షోలో రంభ కోసం సుధీర్ ఓ పాట కూడా పాడాడు. రంభ ఈ షో లో తెలుగులో మాట్లాడింది. అలాగే రంభ డ్యాన్స్ కూడా వేసి అలరించింది. సుధీర్ తో కలిసి బావగారు బాగున్నారా సినిమాలో ఓ సీన్ ని స్కిట్ లా వేశారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Also Read : Ashu Reddy : అషురెడ్డిలో ఇంత బాధ ఉందా.. బ్రెయిన్ ట్యూమర్.. రాత్రికి రాత్రి సర్జరీ.. హెయిర్ తీసేసి..

రంభ రీ ఎంట్రీ ఇచ్చిన సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ఎపిసోడ్ ప్రోమో మీరు కూడా చూసేయండి..

90వ దశకంలో స్టార్ హీరోయిన్స్ లో రంభ ఒకరు. ఆల్మోస్ట్ ఓ పదేళ్ల పాటు రంభ తెలుగు, తమిళ్ సినిమాలను ఏలింది. అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి బోలెడన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. తెలుగులో 1992లో ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రంభ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా స్టార్ హీరోలందరితో చేసింది. సినిమాలు మానేసే ముందు కూడా అల్లు అర్జున్ తో దేశముదురు సినిమాలో, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది.

Also See : ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి లవ్ మెలోడీ సాంగ్ విన్నారా? విజువల్స్ అదిరిపోయాయిగా..

అప్పట్లో ఎక్కువ యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకరు. అలాంటి స్టార్ హీరోయిన్ ఇపుడు రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఆమె ఫ్యాన్స్, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీవీ షోలలోనే కాదు సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.