Shagna sri venun
Shagna sri venun : సినీ పరిశ్రమలో నటులు దర్శకులుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ హీరోయిన్స్ డైరెక్టర్ గా మారడం చాలా రేర్. తాజాగా హీరోయిన్ షగ్న శ్రీ వేణున్ దర్శకురాలిగా మారి మొదటి సినిమాని ప్రకటించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాతో హీరోయిన్ గా మెప్పించింది షగ్న శ్రీ వేణున్. ఫ్యాషన్ డిజైనర్ గా, బిజినెస్ లతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇప్పుడు దర్శకురాలిగా మారడం గమనార్హం.(Shagna sri venun)
ఎస్ 2ఎస్ సినిమాస్ బ్యానర్ పై వరుణ్ సందేశ్ హీరోగా షగ్న శ్రీ వేణున్ హీరోయిన్ గా నటిస్తూ తన దర్శకత్వంలో సినిమా తెరకెక్కించనుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా త్వరలోనే టైటిల్ ప్రకటించి 2026 సమ్మర్ లో సినిమా రిలీజ్ చేస్తారని సమాచారం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read : Multiplex Theaters : హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో మరో కొత్త దోపిడీ.. మొదలుపెట్టిన ప్రసాద్ ఐమాక్స్..
ఈ మూవీ పోస్టర్ లో బ్లాక్ డ్రెస్ ధరించిన యువ జంట చేతిలో రోజా పూలతో ఉండటం, మరో యువకుడు ఈ జంటలోని యువతి చేయి పట్టుకుని కనిపిస్తుండటంతో ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. మరి హీరోయిన్ గా మెప్పించిన షగ్న శ్రీ వేణున్ ఇప్పుడు డైరెక్టర్ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి.
Also Read : Ram Charan : ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్ తో.. చెర్రీతో జత కట్టనున్న లేటెస్ట్ యూత్ క్రష్..