Actress Sobhita Dhulipala: నటి శోభిత, నాగచైతన్యతో ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తుండగా.. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ అందర్నీ షాక్ గురిచేస్తుంది..
శోభిత ధూళిపాళ.. తెలుగు అమ్మాయి అయిన ఈ హీరోయిన్ 2016లో బాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయమై తెలుగులోనూ పలు సినిమాలో నటించింది. అడవిశేషు హీరోగా తెరకెక్కిన గూఢచారి సినిమాలో హీరోయిన్ గా నటించిగా, ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో ఉందంటూ గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా...

Actress Sobhita Dhulipala Instagram Post makes everyone shocks
Actress Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ.. తెలుగు అమ్మాయి అయిన ఈ హీరోయిన్ 2016లో బాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయమై తెలుగులోనూ పలు సినిమాలో నటించింది. అడవిశేషు హీరోగా తెరకెక్కిన గూఢచారి సినిమాలో హీరోయిన్ గా నటించిగా, ఆ తరువాత ‘మేజర్’, ‘కురుప్’ పొన్నియన్ సేల్వన్ వంటి సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Sobhitha Dhulipala : చీరలో వయ్యారాలు పోతున్న శోభిత ధూళిపాళ
కాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో ఉందంటూ గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఒక ఇంటర్వ్యూలో చైతన్యని ప్రశ్నించగా.. హీరో బదులివ్వకుండా కేవలం నవ్వి ఉరుకోవడంతో, ఆ వార్తలో నిజమెంత ఉందొ తెలియలేదు. తాజాగా శోభిత తన ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ అందర్నీ షాక్ కి గురి చేస్తుంది.
పెళ్లి దుస్తుల్లో, వరుడితో కలిసి అడుగులేస్తుండగా, పూల అక్షింతలతో దీవెనలు అందుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒకసారిగా ఆ పోస్ట్ చూసిన నెటిజెన్లు షాక్ అయినా, ఆ తరువాత ఫోటో డిస్క్రిప్షన్ లో మేటర్ చూసి రిలాక్స్ అవుతున్నారు. అది ఒక ప్రమోషనల్ యాడ్ కోసమని అర్ధమవుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేవారికి దుబాయ్ లోని బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి తెలుపుతూ చేసిన ఒక ప్రమోషనల్ ఫోటో షూట్ అని తెలుస్తుంది.