Adah Sharma caught in a religious controversy
Adah Sharma: ముంబై బ్యూటీ ఆదా శర్మ వివాదంలో చిక్కుంది. ప్రథమంగా హిందీ, తెలుగు సినిమాలో నటించిన ఈ భామ.. టాలీవుడ్ కి పూరీజగన్నాధ్ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో పరిచయమైంది. తెలుగులో ‘క్షణం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినా.. దర్శకనిర్మాతలు మాత్రం ఈ అమ్మడిని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీలో వెబ్ సిరీస్ చేస్తూ, సౌత్ లో అడపాదడపా సినిమాలు చేస్తుంది.
Adah Sharma : షార్ట్ నిక్కర్ లో క్యూట్ ఫొటోలతో ఆదా శర్మ..
తాజాగా ఆదా శర్మ బాలీవుడ్ సినిమా ‘ది కేరళ స్టోరీ’లో నటించింది. ఇటీవల ఈ సినిమా టీజర్ ను మూవీ టీం విడుదల చేయగా, అది కాస్త వివాదానికి తెరలేపింది. ఈ టీజర్ లో ఆదా హిజాబ్ ధరించి చెప్పిన డైలాగ్ కేరళలో తీవ్ర దుమారాన్ని లేపుతుంది. ఈ సినిమాలో ఆదా శర్మ బలవంతపు మత మార్పిడికి గురైన షాలిని ఉన్ని కృష్ణన్ యువతి పాత్రలో కనిపించబోతుంది.
“కేరళలో బహిరంగంగా మత మార్పిడిలు జరుగుతున్నాయి. నాతో పాటు 32 వేల మంది కేరళ అమ్మాయిలను బలవంతంగా మత మార్పిడి చేసి విదేశాలకు పంపి ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు” అంటూ చెప్పిన డైలాగ్ కేరళ వాసులలో ఆగ్రహజ్వాలలు రేకెత్తిస్తున్నాయి. ఈ విషయంపై కొంతమంది కేరళ సీఎం పినరై విజయన్ కు పిర్యాదు చేయగా.. సినిమా యూనిట్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు కేరళ డీజీపీ. ‘సుదీప్త్ సేన్’ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.