Adipurush : హనుమంతుడి పక్క సీటు రేటుపై క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.. ఎంతో తెలుసా..?
ప్రభాస్ (Prabhas) రాముడిగా నటిస్తున్న చిత్రం ఆది పురుష్(Adipurush). ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్(Kriti Sanon) సీతగా సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా కనిపించనున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : June 12, 2023 / 06:05 PM IST
Adipurush Team Clarity
Prabhas Adipurush: ప్రభాస్ (Prabhas) రాముడిగా నటిస్తున్న చిత్రం ఆది పురుష్(Adipurush). ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్(Kriti Sanon) సీతగా సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇప్పటికే వేగం పెంచింది చిత్రబృందం.
రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు వస్తాడు అనే నమ్మకం ఉంది. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ చిత్రాన్ని ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఓ సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం తెలియజేసింది. దీంతో చాలా మంది హనుమంతుడి పక్క సీటులో కూర్చోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హనుమంతుడి పక్క సీటుకు సంబంధించిన రూమర్లు మొదలయ్యాయి.
Adipurush : ఆదిపురుష్ మరింతమందికి చేరువవ్వడానికి.. ప్రతి రామాలయానికి 101 ఆదిపురుష్ టికెట్లు ఫ్రీ..
హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచిన సీటు పక్కనే ఉన్న సీట్లను భారీ ధరను అమ్ముతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ విషయం పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఆదిపురుష్ టికెట్ ధరకు సంబంధించి మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. హనుమాన్ జీ కోసం రిజర్వ్ చేసిన సీట్ల పక్కన ఉన్న సీట్లకు రేట్లలో తేడాలు ఉండవని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము! తప్పుడు సమాచారానికి లొంగకండి! జై శ్రీ రామ్! అంటూ ట్వీట్ చేసింది.
#JaiShriRam #AdipurushOnJune16th https://t.co/7cXtLMwxfp
— #Adipurush ?? (@rajeshnair06) June 11, 2023
ఇదిలా ఉంటే.. రామాయణాన్ని ఈ జనరేషన్ వారికి చేరువ చేయాలని పలువురు ప్రముఖులు ఆదిపురుష్ సినిమా టికెట్లను ఫ్రీగా ఇస్తున్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ వృద్ధులకు, అనాథలకు ఉచితంగా సినిమా చూపిస్తానని ప్రకటించారు. ఇందుకోసం 10 వేలకు టికెట్లు బుక్ చేసినట్లు తెలిపారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా పేద పిల్లల కోసం 10 వేల టీకెట్లు బుక్ చేస్తున్నట్లు చెప్పారు. అనాథశ్రమాలకు, పలు పిల్లల సేవాలసంస్థలకు 10వేల టికెట్లు అందించనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కూతురు, బాలీవుడ్ సింగర్ అనన్య బిర్లా వెల్లడించారు. అటు శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ ఖమ్మం జిల్లాలో ఉండే ప్రతి గ్రామంలోని రామాలయానికి 101 టికెట్లు ఉచితంగా ఇస్తానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరే కాకుండా ఇంకా చాలా మంది ఇలా చేస్తున్నారు.
Adipurush : ఆదిపురుష్‌లో సీతగా కృతిసనన్‌ని ఎంపిక చేయడానికి రీజన్ తెలుసా.. కృతి చెప్పిన ఆన్సర్!
