‘ఆదిపురుష్’: త్వరలోనే ‘సీత’గా చూస్తారంటున్న కియారా..
Adipurush-Kiara Advani to play Female Lead: రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’.. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసినప్పటినుంచి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ‘తానాజీ’ ఫేం ఓం రౌత్ రూపొందించనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో హీరోయిన్ కియారా ఆడ్వాణీ కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.
తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని కియారాను ఇదే విషయం అడిగాడు. ‘దక్షిణాది చిత్రాలలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నా’ అని ఓ అభిమాని చేసిన కామెంట్‌కు కియారా స్పందిస్తూ.. ‘‘త్వరలోనే మీరు చూస్తారు’’ అని సమాధానమిచ్చింది. దీంతో కియారా చెప్పింది ‘ఆదిపురుష్’ చిత్రం గురించేనని ప్రచారం సాగుతోంది.
ఉత్తరాదితోపాటు, దక్షిణాదిలోనూ కియారాకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ప్రభాస్ సరసన హీరోయిన్గా కియారాకే ఎక్కువ అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. తెలుగులో ‘వినయ విధేయ రామ’, ‘భరత్ అనే నేను’ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది కియారా.