BANDI TRAILER : సింగిల్ క్యారెక్టర్‌తో ‘బందీ’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..
ఆదిత్య ఓం ఒక్కడే నటిస్తూ తెరకెక్కిన చిత్రం ‘బంధీ’. ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

Aditya Om BANDI TRAILER
BANDI TRAILER : ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో ఆడియన్స్ కి పరిచయమైన నటుడు ‘ఆదిత్య ఓం’. తెలుగు సినిమాలతో పాటు పలు హిందీ సినిమాల్లో కూడా నటించారు. యాక్టర్ గానే కాదు దర్శకుడిగా హిందీలో కొన్ని చిత్రాలను కూడా డైరెక్ట్ చేశారు. దర్శకుడిగా, నటుడిగా ఎప్పుడూ వైవిధ్యమైన, ఆసక్తికరమైన కథలని ఎంచుకునే ఆదిత్య ఓం.. ఇప్పుడు హీరోగా నటిస్తూ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. సినిమా మొత్తం సింగల్ క్యారెక్టర్ తో నడిచే ఒక కథని ప్రేక్షకులకు చూపించబోతున్నారు.
‘బందీ’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం మాత్రమే కనిపిస్తారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. హీరోని కిడ్నాప్ చేసి జనసంచారం లేని ప్రదేశం విడిచి పెడతారు. అడవులు, జలపాతాలు, ఎడారి.. ఇలా ఎన్నో ప్రాంతాలు దాటుకుంటూ హీరో ఎలా బయటపడ్డాడనేది సినిమా కథని తెలుస్తుంది. పర్యావరణ సంరక్షణ నేపథ్యంతో ఈ సినిమా కథ రూపొందిందట. ఈ ట్రైలర్ లో మరో విషయాన్ని కూడా హైలైట్ చేశారు. ప్రతి మనిషి ఆహారం, నీరు, డబ్బు, ఫ్రీడమ్ కోరుకుంటారు. వాటినే కథలో ప్రధాన పాత్రలుగా చూపించబోతున్నారని అర్ధమవుతుంది.
Also read : సలార్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాలీవుడ్‌కి మళ్ళీ టెన్షన్..
ట్రైలర్ చూడడానికి చాలా ఇంట్రస్టింగా ఉంది. ట్రైలర్ లోని ఓ షాట్ లో ఆదిత్య ఓం అడివిలో నగ్నంగా కనిపించి ఆశ్చర్య పరిచారు. ఈ సినిమాలోని స్టంట్స్ కూడా ఆదిత్య ఓం ఎటువంటి డూపు లేకుండా చేశారట. తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్ పై వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తున్నారు. వీరల్, లవన్, సుదేష్ సావంత్ ఈ సినిమాకి సంగీతం అందించారు.