Dacoit : అదిరిపోయిన అడివి శేష్ ‘డెకాయిట్’ గ్లింప్స్‌.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ న‌టిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా 'డెకాయిట్‌'.

Dacoit : అదిరిపోయిన అడివి శేష్ ‘డెకాయిట్’ గ్లింప్స్‌.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Adivi Sesh Dacoit Glimpse out now

Updated On : May 26, 2025 / 11:15 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ న‌టిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్‌’. ఒక ప్రేమ క‌థ అనేది ట్యాగ్‌టైన్‌. షానిల్ డియో ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ క‌థానాయిక‌. అనురాగ్ క‌శ్య‌ప్ కీల‌క పాత్రలో న‌టిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, లుక్స్ మూవీపై అంచనాల‌ను పెంచ‌గా తాజాగా గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. అడివి శేష్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. మొత్తంగా గ్లింప్స్ అదిరిపోయింది.

అడివి శేష్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. డిసెంబ‌ర్ 25న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అడివి శేష్ క‌థ, స్ట్రీన్ ప్లే అందించ‌గా.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.