×
Ad

Adivi Sesh – Akira Nandan : అడివి శేష్, అకిరా ఇంత క్లోజ్ ఫ్రెండ్సా.. అకిరా కోసం పవన్‌కి నో..

అడివి శేష్, అకిరా ఇంత క్లోజ్ ఫ్రెండ్సా..! అసలు వీరిద్దరికి ఇంతటి స్నేహం ఎప్పుడు కలిసింది..?

  • Published On : April 1, 2024 / 06:03 PM IST

Adivi Sesh friendship with Pawan Kalyan son Akira Nandan

Adivi Sesh – Akira Nandan : టాలీవుడ్ జేమ్స్ బాండ్ అడివి శేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ మంచి స్నేహితులు అన్నది అందరికి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు చాలాసార్లు బయటకి వచ్చాయి. అడివి శేష్ కూడా అప్పుడప్పుడు అకిరాకి సంబంధించిన విషయాలను అభిమానులకు తెలియజేస్తుంటారు. అయితే వీరిద్దరికి అసలు స్నేహం ఎప్పుడు కలిసింది అనేది చాలామందికి ఉన్న ఒక సందేహం.

ఎందుకంటే, అడివి శేష్ అండ్ అకిరా మధ్య ఏజ్ గ్యాప్ ఉంది. అంతేకాదు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కాదు. అయితే వీళ్లిద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడివి శేష్ ని అకిరా కలుసుకున్నాడట. అప్పుడు అకిరా, అడివి శేష్‌తో.. ‘నాకు మీ సినిమాలంటే ఇష్టం’ అని చెబితే, అడివి శేష్, అకిరాతో.. నాకు మీ నాన్న సినిమాలు అంటే ఇష్టమని చెప్పారట.

Also read : Vijay Deverakonda : అప్పుడు విజయ్ దేవరకొండని హీరోగా సెలెక్ట్ చేయని దిల్ రాజు.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్..

అలా ఇద్దరి మధ్య ఫోన్ నెంబర్స్ మార్చుకునేంత పరిచయం ఏర్పడింది. కాగా అకిరాకి మ్యూజిక్ పై టచ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ టాలెంట్ తోనే అడివి శేష్ మూవీలోని సాంగ్ ని కంపోజ్ చేసి.. శేష్ కి సెండ్ చేశాడట. ఇక అది చూసిన తరువాత అడివి శేష్.. అకిరాని ప్రేమించడం మొదలుపెట్టాడట. ఈ అబ్బాయి ఏంటి ఇంత స్వీట్ గా ఉన్నాడు అనుకున్నారట. ఇక అప్పటినుంచి అకిరాకి ఒక అన్నయ్యగా వ్యవహరిస్తూ వస్తున్నారట.

అకిరాకి మ్యూజిక్ పై ఎంతో పట్టు ఉందట. అంతేకాదు తన తండ్రి (పవన్) లాగానే ఎన్నో పుస్తకాలు చదువుతాడట. ఈ విషయాలన్నీ మంచు మనోజ్ టాక్ షోలో అడివి శేష్ చెప్పుకొచ్చారు. ఇక షోలో మనోజ్, అడివి శేష్‌ని.. “నీకు పవన్ అండ్ అకిరాని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఎవర్ని సెలెక్ట్ చేసుకుంటావు..?” అని ప్రశ్నించారు. దానికి శేష్ బదులిస్తూ.. “పవన్ గారు అంటే గౌరవం. కానీ అకిరా అంటే ప్రాణం. కాబట్టి అకిరాతోనే మూవీ చేస్తాను. పవన్ కి నో చెబుతాను” అని చెప్పుకొచ్చారు.