Goodachari 2 : గూఢచారి-2 అప్‌డేట్.. ఏజెంట్ 116 బ్యాక్ ఇన్ యాక్షన్
యంగ్ హీరో అడివి శేష్ (Goodachari 2) నటిస్తున్న చిత్రం గూఢచారి-2. ‘మేజర్’ చిత్ర ఎడిటర్ వినయ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుద్దికుంటోంది.

Goodachari 2 Update
Goodachari 2 update : యంగ్ హీరో అడివి శేష్ (Goodachari 2) నటిస్తున్న చిత్రం గూఢచారి-2. 2018లో వచ్చిన గూఢచారి చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘G2’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘మేజర్’ చిత్ర ఎడిటర్ వినయ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. అంతకు మించి ఇప్పటి వరకు మరే అప్డేట్‌ను చిత్రబృందం విడుదల చేయలేదు. అడివి శేష్ మినహా ఈ చిత్రంలో మిగతా నటీనటులు, టెక్నీషియన్లకు ఎవరు అనే వివరాలు తెలియవు.
కాగా.. అడివి శేష్ ఈ సినిమాతో పాటు మరో సినిమాలోనూ నటిస్తున్నారు. అది ఓ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అతడి పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్‌ను ఇటీవల పూర్తి చేశాను. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఉంటుంది. ఈ చిత్రంతో పాటు జీ2(గూఢాచారి 2) సినిమాల షూటింగ్ ఒకే నెలలో ప్రారంభించనున్నట్లు అడివి శేష్ ట్వీట్ చేశాడు.
కాగా.. ఈ ట్వీట్‌ను గూఢచారి 2 నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రీ ట్వీట్ చేస్తూ ఏజెంట్ 116 బ్యాక్ ఇన్ యాక్షన్ అంటూ పైర్ ఎమోజీ పోస్ట్ చేసింది. మొత్తంగా గూఢచారి సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా గూఢచారి-2 సినిమా తెరకెక్కుతోంది.
#Agent116 Back in action!!😁❤️🔥#G2 https://t.co/Q6PcpFJYZP
— People Media Factory (@peoplemediafcy) September 23, 2023