Parrot Missing : నా ఆఫ్రికన్ చిలుక పోయింది.. వెతికి పెట్టండి.. నటి ఆవేదన..
తాజాగా ఓ బాలీవుడ్ నటి తన చిలుక పోయిందని ఆవేదన చెందుతుంది.
Parrot Missing : చాలా మంది సెలబ్రిటీలు మూగ జీవాలు, పక్షులను ప్రేమగా పెంచుకుంటారని తెలిసిందే. ఇక పెంపుడు జీవాలు పోతే మిస్ అయ్యాయి అని కంప్లైంట్ ఇస్తారు, ప్రకటనలు ఇస్తారు, వాటిని వెతికిపెట్టమని కోరతారు. తాజాగా ఓ బాలీవుడ్ నటి తన చిలుక పోయిందని ఆవేదన చెందుతుంది.
బాలీవుడ్ లో పలు సీరియల్స్, సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది నటి సారా ఆఫ్రీన్ ఖాన్. ఈ నటి దగ్గర పలు పెంపుడు జంతువులు ఉండగా ఒక ఆఫ్రికన్ చిలుక కూడా ఉంది. గత అయిదేళ్లుగా ఈ ఆఫ్రికన్ చిలుకకు పాబ్లో అనే పేరు పెట్టుకొని మరీ తన ఇంట్లో పెంచుకుంటుంది. తాజాగా ఆ చిలుక కనిపించకపోవడంతో ఆవేదనకు గురయి చిలకను వెతికి పెట్టండి, పాబ్లో మా దగ్గర అయిదేళ్లుగా ఉంది. మేము చాలా బాధపడుతున్నాము పాబ్లో తప్పిపోయినందుకు అంటూ పోస్టులు చేస్తుంది.
Also Read : Allu Arjun : వామ్మో అల్లు అర్జున్ అంత ట్యాక్స్ కట్టాడా..? టాలీవుడ్‌లో అత్యధికంగా బన్నీనే.. ఎంతో తెలుసా?
సారా అఫ్రీన్ ఖాన్ చిలుక తప్పిపోతే వెతికి పెట్టమని ఆ చిలుక ఫోటోలు, వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తుండగా పలువురు తన ఫ్రెండ్స్, బాలీవుడ్ నటీనటులు కూడా చిలక కనిపిస్తే చెప్పమని పోస్టులు చేస్తున్నారు. అయితే దీనిపై కొంతమంది నెటిజన్లు ఇప్పటికైనా ఆ చిలుకకు స్వేచ్ఛ లభించింది అంటుంటే మరికొంతమంది ఐదేళ్లు పెంచుకున్న చిలుక పోతే ఎంత బాధ ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చిలుక మిస్సింగ్ కేసు బాలీవుడ్ లో చర్చగా మారింది. మరి మీకు కూడా ఆ ఆఫ్రికన్ చిలుక ఎక్కడన్నా కనిపిస్తే ఆ నటిని కాంటాక్ట్ చేయండి. ఆ నటి కాంటాక్ట్ డీటెయిల్స్, చిలక ఫోటోలు మీరు కూడా చూడండి..