Allu Arjun : వామ్మో అల్లు అర్జున్ అంత ట్యాక్స్ కట్టాడా..? టాలీవుడ్‌లో అత్యధికంగా బన్నీనే.. ఎంతో తెలుసా?
ఫార్చూన్ ఇండియా రిలీజ్ చేసిన అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల టాప్ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒక్కడే ఉండటం విశేషం.
Allu Arjun : మన సెలబ్రిటీలు ఎంత సంపాదిస్తారో అంతే రేంజ్ లో ట్యాక్స్ కూడా బాగానే కడతారు. తాజాగా ఫార్చూన్ ఇండియా సంస్థ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ అత్యధికంగా 92 కోట్ల ట్యాక్స్ కట్టి టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే ఫార్చూన్ ఇండియా రిలీజ్ చేసిన అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల టాప్ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒక్కడే ఉండటం విశేషం.
అల్లు అర్జున్ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఏకంగా 14 కోట్లు ట్యాక్స్ కట్టి టాలీవుడ్ లో అత్యధికంగా ట్యాక్స్ కట్టిన స్టార్ గా నిలిచాడు. దీంతో ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. అల్లు అర్జున్ ఇంత సంపాదిస్తున్నాడా అని చర్చించుకుంటున్నారు.
Also Read : Nani – Vivek Athreya : ముచ్చటగా మూడోసారి.. స్టేజిపై వివేక్ ఆత్రేయకు మళ్ళీ సినిమా ఆఫర్ ఇచ్చిన నాని..
అయితే అల్లు అర్జున్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకునే హీరోలు ఉన్నా అల్లు అర్జున్ బయట బిజినెస్ లలో కూడా ఇటీవల ఎక్కువ పెట్టుబడులు పెట్టాడు. సినిమాల్లో రెమ్యునరేషన్స్ తో పాటు యాడ్స్, థియేటర్స్, పలు బిజినెస్ లతో అల్లు అర్జున్ బాగానే సంపాదిస్తున్నాడు. అందుకే ఈ రేంజ్ లో ట్యాక్స్ కట్టాడు బన్నీ. దీంతో ఈ విషయాన్ని కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు.