Nani – Vivek Athreya : ముచ్చటగా మూడోసారి.. స్టేజిపై వివేక్ ఆత్రేయకు మళ్ళీ సినిమా ఆఫర్ ఇచ్చిన నాని..
సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్లో నాని స్టేజిపై మాట్లాడుతూ వివేక్ ఆత్రేయకు తనతో మూడో సినిమా ఆఫర్ కూడా ఇచ్చేసాడు.
Nani – Vivek Athreya : వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన సరిపోదా శనివారం మంచి హిట్ కొట్టి భారీగా కలెక్ట్ చేసింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికి సినిమా చాలా బాగున్నా కమర్షియల్ గా ఫెయిల్ అయి క్లాసిక్ గా నిలిచింది. ఇప్పుడున్న తెలుగు దర్శకులలో సరికొత్త స్క్రీన్ ప్లేతో, అచ్చ తెలుగుతనంతో, మంచి రైటింగ్ తో సినిమాలు తీసే దర్శకులలో వివేక్ ఆత్రేయ ఒకరు. తన మొదటి సినిమా నుంచి కూడా ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు.
నానికి కమర్షియల్ ఫెయిల్యూర్ ఇచ్చినా అతని మీద నమ్మకంతో మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇప్పుడు ఇలా సరిపోదా శనివారంతో హిట్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో నాని స్టేజిపై మాట్లాడుతూ వివేక్ ఆత్రేయకు తనతో మూడో సినిమా ఆఫర్ కూడా ఇచ్చేసాడు.
Also Read : Nani : కేరళ ఫ్యాన్ కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాని..
సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ.. వివేక్ సక్సెస్ అయినందుకు నేను ఎక్కువ సంతోష పడుతున్నాను. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా వివేక్ కే. ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు. కానీ వివేక్ తో ఆల్రెడీ అంటే సుందరానికి సినిమాతో డ్రామా చేశాను. సరిపోదా శనివారం సినిమాతో యాక్షన్ చేశాను. ఈసారి మళ్ళీ మనం చేస్తే ఆడియన్స్ ఒక్కరు కూడా సీట్లో కూర్చోకూడదు, పడి పడి నవ్వాలి. అలాంటి కామెడీ సినిమా చేయాలి అని అడగడంతో వివేక్ కూడా ఓకే చెప్పేసాడు. దీంతో భవిష్యత్తులో వీరి కాంబోలో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా రాబోతుందని అర్థమయిపోతుంది.