All We Imagine as Light : 30 ఏళ్ళ తర్వాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ మెయిన్ విభాగం కాంపిటేషన్‌లో.. లేడీ డైరెక్టర్ తీసిన ఇండియన్ సినిమా..

ఈ సంవత్సరం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెయిన్ విభాగమైన పామ్‌ డ ఓర్‌ అవార్డు కేటగిరిలో ఇండియన్ సినిమా పోటీకి నిలిచింది. దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఈ విభాగంలో ఇండియన్ సినిమా పోటీ పడుతుంది.

after 30 years indian movie All We Imagine as Light competing in Cannes Film Festival Main Category

All We Imagine as Light : ఫ్రాన్స్(France) లో జరిగే ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్(Cannes Film Festival) కి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు, ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరవుతారు. ప్రతి సంవత్సరం ఇండియా నుంచి పలు సినిమాలు వివిధ విభాగాల్లో అక్కడ స్ట్రీమింగ్ చేస్తారు. అనేకమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా పాల్గొని అక్కడి రెడ్ కార్పెట్ పై నడుస్తారు.

ఈ సంవత్సరం 77వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 15 నుంచి జరగనుంది. ఈ సంవత్సరం కూడా పలువురు ఇండియన్ సినీ పరిశ్రమ నుంచి హాజరు కానున్నారు. అయితే ఈ సంవత్సరం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెయిన్ విభాగమైన పామ్‌ డ ఓర్‌ అవార్డు కేటగిరిలో ఇండియన్ సినిమా పోటీకి నిలిచింది. దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఈ విభాగంలో ఇండియన్ సినిమా పోటీ పడుతుంది.

Also Read : Jani Master : కంటెస్టెంట్స్ చేసిన పనికి ‘ఢీ’ షోలో మైక్ విసిరేసి, అరిచి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. వైరల్ అవుతున్న వీడియో..

ఈ 77వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియన్ దర్శకురాలు తెరకెక్కించిన ‘ఆల్‌ వుయ్ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ అనే సినిమా కాన్స్‌ లో ప్రధాన విభాగమైన పామ్‌ డ ఓర్‌ అవార్డు కేటగిరిలో మరో 20 సినిమాలతో పోటీ పడుతుంది. గతంలో 30 ఏళ్ళ క్రితం 1994లో షాజీ కరణ్ తెరకెక్కించిన స్వహం అనే సినిమా ఈ కేటగిరిలో పోటీలో నిలిచింది. మళ్ళీ అప్పట్నుంచి ఇప్పటివరకు ఇండియా నుంచి ఏ సినిమా ఈ కేటగిరిలో పోటీకి వెళ్ళలేదు. మరి ఈ సారి అవార్డు గెలుస్తారా లేదా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు