Jani Master : కంటెస్టెంట్స్ చేసిన పనికి ‘ఢీ’ షోలో మైక్ విసిరేసి, అరిచి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో జానీ మాస్టర్ అరవడంతో వైరల్ గా మారింది.

Jani Master : కంటెస్టెంట్స్ చేసిన పనికి ‘ఢీ’ షోలో మైక్ విసిరేసి, అరిచి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. వైరల్ అవుతున్న వీడియో..

Dance Show Dhee Promo goes with Jani Master fires on Contestants

Updated On : April 13, 2024 / 9:07 AM IST

Jani Master : డ్యాన్స్(Dance) లతో పాటలు కామెడీ కూడా చేస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ప్రముఖ డ్యాన్స్ షో ఢీ(Dhee). అపుడప్పుడు షోలో ఎవరో ఒకరు అలగడం, ఫైర్ అవ్వడం జరుగుతుంటాయి. కొన్ని ముందే అనుకోని చేసినా కొన్ని మాత్రం నిజంగానే జరుగుతాయి. ప్రస్తుతం ఢీ షోలో సెలెబ్రిటీ డ్యాన్స్ సీజన్ నడుస్తుంది. కొద్దోగొప్పో ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి డ్యాన్సులు చేయిస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో జానీ మాస్టర్ అరవడంతో వైరల్ గా మారింది. ప్రోమోలో ఎలిమినేట్ సెషన్ జరుగుతుండగా సాత్విక్, వర్షిణి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ వాళ్ళకి ఓటు వేయాలి. అయితే రాకీ సాత్విక్ కళ్ళతో చూపించి వర్షిణికి ఓట్ వేయమన్నాడని వేసాను అని చెప్పడంతో జానీ మాస్టర్ ఫైర్ అయ్యారు.

Also Read : Vishwak Sen : ఫస్ట్ టైం అంత చలిలో ప్రెస్ మీట్ పెట్టిన ‘గామి’ టీం.. నాకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు అంటున్న విశ్వక్..

అసలు ఇది డ్యాన్స్ షో అనుకుంటున్నారా? లేక మీ ఇష్టమా? డ్యాన్స్ అంటే లైఫ్.. వాడెవడో చెప్తే నువ్వు ఓట్ వేస్తావా? అంటూ అరిచి తన చేతులో మైక్ ని నేల మీద విసిరేసి అక్కడి నుంచి అరుచుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. జానీ మాస్టర్ కి కోపం రావడం కరెక్ట్ అని కొంతమంది కామెంట్స్ చేస్తుండగా? ఇది నిజమేనా లేక ఇది కూడా స్క్రిప్టా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి జానీ మాస్టర్ ఎందుకు అరిచాడు? షోలో ఉన్నాడా? వెళ్లిపోయాడా? తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.